థర్డ్‌ అంపైర్ పొరపాటు.. నాటౌట్‌ని ఔట్‌ ఇచ్చేశాడు.. చివరకు

బిగ్‌బాష్‌ లీగ్‌ 2023-24 కొనసాగుతోంది. సిడ్నీ సిక్సర్స్, మెల్‌బోర్న్‌ స్టార్స్‌ మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన జరిగింది.

By Srikanth Gundamalla  Published on  7 Jan 2024 6:15 AM GMT
bbl, cricket, third umpire,  wrong button,

థర్డ్‌ అంపైర్ పొరపాటు.. నాటౌట్‌ని ఔట్‌ ఇచ్చేశాడు.. చివరకు 

బిగ్‌బాష్‌ లీగ్‌ 2023-24 కొనసాగుతోంది. ఈ టోర్నీలో భాగంగా మెల్‌బోర్న్‌ వేదికగా సిడ్నీ సిక్సర్స్, మెల్‌బోర్న్‌ స్టార్స్‌ జట్లు పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్‌లోనే ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మామూలుగా అయితే ఔట్‌, నాటౌట్‌ విషయంలో గ్రౌండ్‌లో ఉన్న అంపైర్లు సరైన నిర్ణయం కొన్ని సార్లు తీసుకోకపోవచ్చు. అలాంటి సమయంలోనే రివ్యూ కోసం థర్డ్‌ అంపైర్‌ను కోరతారు. అక్కడ టెక్నాలజీ సాయంతో అన్నింటినీ చెక్‌ చేసిన తర్వాతే నిర్ణయాన్ని ప్రకటిస్తారు. అలాంటి థర్డ్‌ అంపైర్‌ తాజాగా పొరపాటు చేశారు.

సిడ్నీ సిక్సర్స్‌, మెల్‌బోర్న్‌ స్టార్స్‌ మ్యాచ్‌లోనే ఈ సంఘటన జరిగింది. క్లియర్‌గా నాటౌట్‌ అయినా కూడా థర్డ్‌ అంపైర్‌ ఔట్‌గా ప్రకటించేశాడు. కానీ.. కొద్ది సెకన్లకే మళ్లీ తేరుకుని నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సిడ్నీ ఇన్నింగ్స్ మూడో ఓవర్‌ వేసిన ఇమాడ్‌ వసీం బౌలింగ్‌లో జేమ్స్ విన్స్‌ స్రెయిట్‌ డ్రైవ్‌ షాట్‌ కొట్టాడు. బౌలర్ వసీమ్‌ బంతిని ఆపేందుకు ప్రయత్నించగా.. బాల్‌ చేతిని తాకి నేరుగా నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న స్టంప్స్‌కు తగిలింది. దాంతో.. బౌలర్‌తో పాటు మెల్‌బోర్న్‌ ఫీల్డర్లు రనౌట్‌కు అప్పీల్ చేశారు. ఈ మేరకు ఫీల్డ్‌ అంపైర్‌ నిర్ణయం తీసుకోలేక థర్డ్‌ అంపైర్‌కు రిఫర్ చేశారు. అయితే.. రీప్లేలో బంతి స్టంప్స్‌ను తాకడానికి ముందే బ్యాటర్ క్రీజులోకి వచ్చినట్లుగా కనిపించింది. దాంతో.. అందరూ నాటౌట్‌ అని ఫిక్స్‌ అయిపోయారు. రీప్లే తర్వాత థర్డ్‌ అంపైర్‌ నాటౌట్‌ అని ఎల్‌ఈడీ స్క్రీన్‌పై చూపించాల్సి ఉంది. కానీ.. అతను పొరపాటుగా ఔట్‌ అనే బటన్‌ నొక్కాడు. దాంతో.. స్క్రీన్‌పై ఔట్‌ అనే టెక్ట్స్ వచ్చింది. దాంతో.. అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాక్‌ అయ్యారు.

పొరపాటును గ్రహించిన థర్డ్‌ అంపైర్ వెంటనే సరిదిద్దుకున్నాడు. మళ్లీ స్క్రీన్‌పై నాటౌట్‌ వచ్చేలా చేశాడు. దాంతో.. అందరూ కూల్ అయ్యారు. ఇక ఈ మ్యాచ్‌లో 157 పరుగుల టార్గెట్‌ను సిడ్నీ సిక్సర్స్‌ 18.1 ఓటర్లలో మూడు వికెట్లు కోల్పోయి చేదించింది. మొదట బ్యాటింగ్ చేసిన మెల్‌బోర్న్‌ స్టార్స్‌ 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది.

Next Story