నేడు సువాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య ఆసక్తికరమైన మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఇరు జట్లు చెరో ఐదు మ్యాచులు ఆడాయి. నాలుగు మ్యాచుల్లో విజయం సాధించిన సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మూడు మ్యాచుల్లో గెలుపొందిన రాహుల్ నేతృత్వంలోని లక్నో రెండో స్థానంలో ఉంది. ఈ స్టేడియంలో ఎనిమిది నల్లమట్టి పిచ్‌లు ఉన్నాయి. వాటిలో మూడింటిని ఈ ఐపిఎల్ సీజన్ కోసం సిద్ధం చేశారు. మ్యాచ్ 4వ పిచ్‌లో ఆడే అవకాశాలు ఉన్నాయి. మ్యాచ్ జరుగుతున్న కొద్దీ బ్యాటింగ్ చేయడం కష్టతరంగా మారే అవకాశం ఉంది. గ్రౌండ్ కూడా చాలా చిన్నదే.. 70 మీటర్ బౌండరీ లైన్ లు ఉన్నాయి. ఇరు జట్లు ఇప్పటి వరకు ఐపీఎల్‌లో కేవలం రెండు సార్లు మాత్రమే తలపడ్డాయి. ఈ రెండు మ్యాచుల్లోనూ రాజస్థాన్ విజయం సాధించింది. జైపూర్‌లో బట్లర్ సగటు 54.25 ఉంది. ఇక్కడ అత్యధిక స్కోరు 95*తో నాలుగు అర్ధసెంచరీలు చేశాడు.
స్క్వాడ్‌లు:
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు: కేఎల్ రాహుల్(సి), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్(w), ఆయుష్ బడోని, అవేష్ ఖాన్, యుధ్వీర్ సింగ్ చరక్, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్, అమిత్ మిశ్రా, జయదేవ్ ఉనద్కత్ , కృష్ణప్ప గౌతం, ప్రేరక్ మన్కడ్, డేనియల్ సామ్స్, మనన్ వోహ్రా, క్వింటన్ డి కాక్, స్వప్నిల్ సింగ్, నవీన్-ఉల్-హక్, యష్ ఠాకూర్, రొమారియో షెపర్డ్, కరణ్ శర్మ, మయాంక్ యాదవ్
రాజస్థాన్ రాయల్స్ జట్టు: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(w/c), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ జంపా, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్, దేవదత్ పడిక్కల్, మురుగన్ అశ్విన్, డోనవాన్ ఫెరీరా, నవదీప్ సైనీ, జో రూట్, జాసన్ హోల్డర్, ఆకాష్ వశిష్ట్, KC కరియప్ప, ఒబెద్ మెక్‌కాయ్, KM ఆసిఫ్, కుల్దీప్ యాదవ్, కుల్దీప్ సేన్, అబ్దుల్ బాసిత్, కునాల్ సింగ్ రాథోడ్