తమ టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లను భారతదేశం నుండి తరలించాలన్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను ఐసీసీ బోర్డు తిరస్కరించింది. బోర్డు ఓటింగ్‌లో ఈ ప్రతిపాదన 14-2 తేడాతో వీగిపోయింది. సమావేశం తర్వాత, బంగ్లాదేశ్ జట్టు తన షెడ్యూల్ చేసిన మ్యాచ్‌ల కోసం భారతదేశానికి వెళ్లడానికి నిరాకరిస్తే 2026 టీ20 ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్‌ను ఇతర టీమ్ తో భర్తీ చేస్తామని ఐసీసీ హెచ్చరించింది. ఓటింగ్ తర్వాత, ఫలితం గురించి బంగ్లాదేశ్ ప్రభుత్వానికి అధికారికంగా తెలియజేయాలని ఐసీసీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును కోరింది. బంగ్లాదేశ్ ప్రయాణించడానికి ఇష్టపడకపోతే, టోర్నమెంట్ నుండి తొలగించి స్కాట్లాండ్‌తో భర్తీ చేస్తామని ఐసీసీ స్పష్టం చేసింది.
గురువారం, జనవరి 22న జరిగే క్యాబినెట్ సమావేశంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం T20 ప్రపంచ కప్‌లో తమ దేశం పాల్గొనడంపై నిర్ణయం తీసుకోనుంది. ఈ విషయంపై వారి అభిప్రాయం తీసుకోవడానికి ప్రభుత్వం జాతీయ క్రికెట్ జట్టు సభ్యులను కూడా సంప్రదించనుంది.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ T20 ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్ పాల్గొనడంపై నిర్ణయం తీసుకోవడానికి బంగ్లాదేశ్‌కు ఒక రోజు సమయం ఇచ్చింది. జట్టుకు ఎటువంటి భద్రతా ముప్పు లేదని, తమ మ్యాచ్‌లను భారతదేశం నుండి తరలించాలన్న బంగ్లాదేశ్ అభ్యర్థనను ICC తిరస్కరించింది.