అండర్-19 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ ను ఓడించిన భారత్
అండర్-19 వరల్డ్ కప్ లో బ్లూంఫోంటీన్ లో జరిగిన లీగ్ మ్యాచ్ లో 84 పరుగుల తేడాతో
By Medi Samrat Published on 20 Jan 2024 4:29 PM GMTఅండర్-19 వరల్డ్ కప్ లో బ్లూంఫోంటీన్ లో జరిగిన లీగ్ మ్యాచ్ లో 84 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ను చిత్తుగా ఓడించింది భారతజట్టు. 252 పరుగుల లక్ష్యఛేదనకు బరిలో దిగిన బంగ్లాదేశ్ ను 45.5 ఓవర్లలో 167 పరుగులకే కుప్పకూల్చింది. భారత బౌలర్లలో సౌమీ పాండే 4 వికెట్లతో రాణించాడు. ముషీర్ ఖాన్ 2, రాజ్ లింబానీ 1, అర్షిన్ కులకర్ణి 1, ప్రియాన్షు మోలియా 1 వికెట్ తీశారు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ లో అత్యధికంగా మహ్మద్ షిహాబ్ జేమ్స్ 54 పరుగులు చేయగా, ఆరిఫుల్ ఇస్లాం 41 పరుగులు సాధించాడు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. 31 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత జట్టును ఓపెనర్ ఆదర్శ్ సింగ్(76; 96 బంతుల్లో 6 ఫోర్లు), కెప్టెన్ ఉదయ్ సహారన్(64; 94 బంతుల్లో 4 ఫోర్లు) ఆదుకున్నారు. ఓపెనర్ ఆర్షిన్ కులకర్ణి(7) పరుగులకే వెనుదిరిగాడు. ఆపై కొద్దిసేపటికే ముషీర్ ఖాన్(3) కూడా ఔటయ్యాడు. దీంతో టీమిండియా 31 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో ఆదర్శ్ సింగ్(76) ఉదయ్ సహారన్(64) జోడి ఆదుకుంది. మూడో వికెట్‌కు ఏకంగా 116 పరుగులు జోడించారు. చివరలో ఆరవెల్లి అవనీష్(23; 17 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్స్), సచిన్ దాస్(26; 20 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్) విలువైన పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో మరుఫ్ మృధా 5 వికెట్లు తీశాడు. లేదంటే భారత జట్టు భారీ స్కోరు సాధించి ఉండేది.
Next Story