సెమీస్‌కు దూసుకెళ్లిన భ‌జ‌రంగ్ పునియా

Bajrang Punia enter semis in Tokyo Olympics.భార‌త అగ్ర‌శేణి రెజ్ల‌ర్ భ‌జ‌రంగ్ పునియా టోక్యో ఒలింపిక్స్‌లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Aug 2021 5:25 AM GMT
సెమీస్‌కు దూసుకెళ్లిన భ‌జ‌రంగ్ పునియా

భార‌త అగ్ర‌శేణి రెజ్ల‌ర్ భ‌జ‌రంగ్ పునియా టోక్యో ఒలింపిక్స్‌లో అద‌ర‌గొడుతున్నాడు.65 కిలోల ఫ్రీస్ట‌యిల్‌లో సెమీస్‌కు దూసుకెళ్లాడు. నేడు జ‌రిగిన క్వార్ట‌ర్ ఫైన‌ల్‌లో ఇరాన్‌కు చెందిన గియాసి చెకా మోర్త‌జాను 2-1 తేడాతో ఓడించి సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాడు. సెమీస్‌లో క‌నుక భ‌జ‌రంగ్ విజ‌యం సాధిస్తే.. ఏదో ఒక మెడ‌ల్ రావ‌డం ఖాయం. ఇక సెమీస్‌లో అజ‌ర్ బైజాన్ రెజ్ల‌ర్ హాజి అలియేవ్‌తో బ‌జ‌రంగ్ పూనియా త‌ల‌ప‌డ‌నున్నాడు. ఈ రోజు మ‌ధ్యాహ్నం ఆ మ్యాచ్ జ‌ర‌గ‌నున్న‌ది.

పిన్‌డౌన్ సాయంతో ప్ర‌త్య‌ర్థిని ఉక్కిరిబిక్కిరి చేశాడు. కేవ‌లం 4:46 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించాడు. మొద‌టి ప‌రియ‌డ్‌లో ఇద్ద‌రు ఆట‌గాళ్లు హోరాహోరిగా పోటిప‌డ్డారు. ఉడుం ప‌ట్టు బిగించారు. ఇద్ద‌రూ ర‌క్ష‌ణాత్మ‌కంగా ఆడ‌డంతో మోర్త‌జా 1-0 ఆధిక్యంలోకి వెళ్లాడు. రెండో రౌండ్‌లో.. భ‌జ‌రంగ్ కాళ్ల‌ను ప‌ట్టేసుకున్న మోర్త‌జా పాయింట్లు సాధించేలా క‌నించాడు. కానీ అత‌డి ఆట‌ల‌ను భ‌జరంగ్ సాగ‌నివ్వ‌లేదు. ఎదురుదాడి చేసి అడ్డుకున్నాడు. ట‌చ్‌డౌన్ చేసి రెండు పాయింట్లు సాధించాడు. సాంకేతికంగా మెరుగ్గా ఆడే భ‌జ‌రంగ్ స‌మ‌యం దొర‌క‌గానే ప్ర‌త్య‌ర్థిని రింగులో ప‌డేసి పిన్‌డౌన్ చేసి సెమీస్‌కు దూసుకెళ్లాడు.

Next Story
Share it