హీరో సిద్దార్థ క్షమాపణలు.. స్పందించిన సైనా నెహ్వాల్
Badminton player Saina Nehwal reacts to actor Siddharth's apology.భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ పై
By తోట వంశీ కుమార్ Published on 12 Jan 2022 2:30 PM ISTభారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ పై హీరో సిద్దార్థ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇక హీరో సిద్ధార్థ్ తాను చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పాడు. కాగా.. సిద్దార్థ్ క్షమాపణలు చెప్పడంపై సైనా నెహ్వాల్ స్పందించారు. తప్పుతెలుసుకుని క్షమాపణ కోరడం సంతోషకరమన్నారు. అయితే.. ఓ మహిళ పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అస్సలు ఆయోదయోగ్యం కాదన్నారు. ఏదీ ఏమైనప్పటికీ భగవంతుడు సిద్దార్థను చల్లగా చూడాలని ఆకాంక్షించారు." నటుడు సిద్ధార్థ్ మొదట నా గురించి ఎదో మాట్లాడారు.. మళ్లీ క్షమాపణలు కూడా చెప్పాడు.. అసలు ఈ విషయం ఎందుకు వైరల్ అయిందో కూడా నాకు తెలియదు. ట్విట్టర్‌లో నేను ట్రెండ్ అవ్వటం చూసి ఆశ్చర్యపోయాను. కానీ సిద్ధార్థ్ క్షమాపణలు చెప్పినందుకు సంతోషంగా ఉంది" అంటూ సైనా నెహ్వాల్ మీడియాతో మాట్లాడారు.
He (actor Siddharth) said something about me first & then apologized. I don't even know why it went so viral. I was surprised to see myself trending on Twitter. Happy that Siddharth has apologized: Badminton player Saina Nehwal https://t.co/uKdfRPXMgn pic.twitter.com/Ls0qWVLJ8X
— ANI (@ANI) January 12, 2022
అసలు ఏం జరిగిందంటే..?
ఈనెల 6న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పంజాబ్ పర్యటనలో భాగంగా ఫిరోజ్ పూర్ కు వెళ్లారు. రోడ్డు మార్గంలో వెళ్తున్న ప్రధాని వాహనాలను రైతులు అడ్డిగించి నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో నరేంద్ర మోదీ భద్రత లోపం గురించి సోషల్ మీడియా పెద్ద దుమారమే రేగింది. ఈ విషయంపై సైనా నేహ్వల్ స్పందిస్తూ.. 'మా ప్రధాని భద్రత విషయంలో రాజీ పడితే ఏ దేశం కూడా సురక్షితంగా ఉండదు. ఈ పిరికివాళ్ల దాడిని నేను ఖండిస్తున్నాను' అంటూ ట్వీట్ చేసింది.
అయితే సైనా నేహ్వాల్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ సిద్ధార్థ్ .. 'కాక్ ఛాంపియన్ ఆఫ్ ది వరల్డ్.. థ్యాంక్స్ గాడ్ మాకు ప్రొటెక్టర్స్ ఆఫ్ ఇండియా. షేమ్ ఆన్ యూ రిహన్నా ' అంటూ ట్వీట్ చేశాడు. సిద్ధార్థ్ చేసిన ఈ కామెంట్స్ వివాదానికి దారితీశాయి. సిద్ధార్థ్ వాడిన పదజాలంపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే సిద్ధార్థ ట్విటర్ అకౌంట్‌ను బ్లాక్ చేయాలని ట్విటర్ ఇండియాకు లేఖ రాసింది. సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ ఆడవారిని అవమానపరిచేలా ఉన్నాయంటూ పలువురు ప్రముఖులు సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
తాను చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగడంతో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు హీరో సిద్ధార్థ్ బహిరంగ క్షమాణలు చెప్పారు. ఇక తాను కేవలం జోక్ చేయాలన్న ఉద్దేశంతోనే ఆ ట్వీట్ చేశానని, కానీ ఆ వ్యాఖ్యలు చాలా మందిని బాధించేలా ఉండటంతో క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. ఈ సందర్భంగా సైనా నెహ్వాల్‌కు ఓ లేఖ రాశారు. సైనా ఎప్పటికీ మన ఛాంపియనే అంటూ రాసిన లేఖను తన ట్విటర్ అకౌంట్‌లో పోస్టు చేశారు. ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన క్షమాపణ లేఖలో సిద్ధార్థ్ ఇలా వ్రాశాడు. "ప్రియమైన సైనా, కొన్ని రోజుల క్రితం మీ ట్వీట్‌కు ప్రతిస్పందనగా నేను రాసిన నా అసభ్యకరమైన జోక్‌కు నేను మీకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. నేను చాలా విషయాలలో మీతో విభేదించవచ్చు. నేను చేసిన వ్యాఖ్యలు సమర్థించతగినవి కాదు. జోక్ విషయానికొస్తే, జోక్‌ని వివరించాల్సి వస్తే.. అది చాలా మంచి జోక్ కాదు. అలాంటి జోక్ చేసినందుకు తన వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతున్నా. అయితే చాలా మంది అనట్లుగా నా పదజాలం, జోక్ వెనుక ఎవరినీ అగౌరవ పర్చాలని ఉద్దేశం లేదు. స్త్రీగా మిమ్మల్ని కించపర్చాలన్న ఉద్దేశం నాకు లేదు. నా క్షమాపణ లేఖని అంగీకరిస్తారని ఆశిస్తున్నా.. ' అంటూ హీరో సిద్ధార్థ్ లేఖ రాశారు. దీనిపై సైనా స్పందించింది.