9 ఏళ్ల బంధానికి స్వస్తి.. విడిపోయిన శిఖర్ ధావన్-అయేషా ముఖర్జీ జంట
Ayesha Mukherjee confirms divorce with Shikhar Dhawan.ఇటీవల విడాకులు తీసుకుంటున్న సెలబ్రెటీల సంఖ్య
By తోట వంశీ కుమార్ Published on 8 Sept 2021 7:48 AM ISTఇటీవల విడాకులు తీసుకుంటున్న సెలబ్రెటీల సంఖ్య పెరుగుతోంది. తాజాగా టీమ్ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్, అయేషా ముఖర్జీ జంట విడిపోయింది. ఈ విషయాన్ని అయేషా ముఖర్జీ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. దీంతో వీరి 9ఏళ్ల వైవాహిక బంధం ముగిసింది. ఈ విషయం తెలిసిన అభిమానులు షాక్‌కు గురైయ్యారు. అయేషా..ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన బాధను సుదీర్ఘ వివరణతో పంచుకుంది. మెల్‌బోర్న్ బాక్సర్ అయిన అయేషా ముఖర్జీతో ధావన్ ప్రేమలో పడ్డాడు. వీరు 2012లో పెళ్లి చేసుకున్నారు. 2014లో వీరికి ఒక బాబు(జొరావర్) పుట్టాడు. కాగా.. శిఖర్ దావన్‌తో పెళ్లికి ముందే అయేషా వివాహం అయ్యి.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. విడాకుల అనంతరం ధావన్‌ను రెండో వివాహం చేసుకుంది.
కాగా.. అయేషా ముఖర్జీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాసుకొచ్చింది. వివాహం, విడాకులు అనే పదాలు చాలా శక్తిమంతమైవని తెలిపింది. తొలిసారి విడాకులు తీసుకుంటున్నప్పుడు తాను చాలా భయపడ్డానని, జీవితంలో ఓడిపోయినట్టు, తప్పు చేస్తున్న భావన తనను పట్టి పీడించాయని చెప్పింది. తన తల్లిదండ్రులను, పిల్లలను నిరాశకు గురిచేసినట్లు బావించినట్లు తెలిపింది. ఇక రెండోసారి విడాకులు తీసుకోవడం అనేది ఊహించుకుంటే భయంకరంగా ఉన్నట్లు తెలిపింది.
ఇదిలా ఉంటే.. విడాకుల విషయమై శిఖర్ ధావన్ ఇప్పటి వరకు స్పందించలేదు. ప్రస్తుతం టెస్టుల్లో స్థానం కోల్పోయిన శిఖర్.. టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కించుకుంటాడా లేదా అన్నది నేడు తెలియనుంది. నేడు బీసీసీఐ టీ 20 ప్రపంచకప్ జట్టును ప్రకటించనుంది. ఇప్పటికే రోహిత్ శర్మ ఓపెనర్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకోగా.. మరో స్థానం కోసం రాహుల్, శిఖర్‌ల మధ్య పోటి నెలకొంది.