Video : దుఃఖంలో ఉన్న డేవిడ్ మిల్లర్‌కు ధైర్యం చెప్పిన అక్సర్..!
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 1 పరుగుతో ఓటమి పాలైన తర్వాత అందరూ డేవిడ్ మిల్లర్‌పై విమర్శలు చేస్తున్నారు
By - Medi Samrat |
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 1 పరుగుతో ఓటమి పాలైన తర్వాత అందరూ డేవిడ్ మిల్లర్‌పై విమర్శలు చేస్తున్నారు. మ్యాచ్ చివరి ఓవర్ ఐదో బంతికి కుల్దీప్ యాదవ్‌కు మిల్లర్ స్ట్రైక్ ఇవ్వకపోవడం, ఆఖరి బంతికి షాట్ కొట్టకపోవడంతో కుల్దీప్ రనౌట్‌తో ఢిల్లీ మ్యాచ్‌లో ఓడిపోవాల్సి వచ్చింది.
మ్యాచ్‌లో ఓటమి తర్వాత, ఢిల్లీ క్యాపిటల్స్ X లో డేవిడ్ మిల్లర్ వీడియోను షేర్ చేసింది, అందులో అతను డ్రెస్సింగ్ రూమ్‌లో ఒంటరిగా నిరుత్సాహంగా కనిపించాడు. ఆ వీడియో వైరల్ అయిన తర్వాత, ఢిల్లీ క్యాపిటల్స్ మరో వీడియోను షేర్ చేసింది, ఇందులో కెప్టెన్ అక్షర్ పటేల్ డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని మారుస్తున్నట్లు కనిపించింది.
We keep smiling 😄💙 pic.twitter.com/DWdyihcmzA
— Delhi Capitals (@DelhiCapitals) April 9, 2026
వాస్తవానికి, గుజరాత్‌తో ఓటమి తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లతో మాట్లాడుతున్న అక్షర్ పటేల్, చివరి ఓవర్లలో మిల్లర్ వేగంగా బ్యాటింగ్ చేయకపోతే ఈ మ్యాచ్‌లో జట్టు విజయానికి చేరువయ్యేది కాదని అందరికీ గుర్తు చేశాడు. కాబట్టి ఓటమికి ఆయన ఏ ఒక్క నిర్ణయాన్ని కూడా తప్పు పట్టడం లేదు.
ఈ సీజన్ ప్రారంభంలో మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలని, ప్రతి పరిస్థితిలో ప్రశాంతంగా ఉండాలని నేను మీకు చెప్పాను. మనమందరం విచారంగా ఉన్నాము, బాధగా ఉన్నాము, కానీ మనం మళ్లీ నవ్వగలము, సమస్య లేదు. ఇది సుదీర్ఘ టోర్నీ. అతను (మిల్లర్) ఆ సిక్సర్లు కొట్టకపోతే, మనం ఆటలో ఉండేవాళ్లం కాదు. చెన్నైకి వెళ్లి మళ్లీ ప్రారంభిస్తాం. నవ్వుతూ ఉండండి అని అన్నాడు.
మ్యాచ్ తర్వాత అక్సర్ తన జట్టు గెలవడానికి.. బలమైన స్థితిలో ఉంచడానికి.. కొన్ని పరిస్థితులలో మరింత తెలివిగా ఆడాలని అంగీకరించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తదుపరి మ్యాచ్ ఏప్రిల్ 11న చెపాక్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతుంది.