పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకం
Avani Lekhara Wins Gold Medal in Paralympics.టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణ
By తోట వంశీ కుమార్ Published on
30 Aug 2021 3:29 AM GMT

టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణ పతకం లభించింది. మహిళల షూటింగ్ 10 మీటర్ల విభాగంలో అవని లేఖరా అదరగొట్టింది. దీంతో పారాలింపిక్స్‌లో షూటింగ్‌లో భారత్‌కు బంగారు పతకం అందించిన మహిళగా అవని రికార్డు సృష్టించింది. టోక్యో పారాలింపిక్స్‌లో ఇప్పటివరకు వరకు భారత్‌కు స్వర్ణం, రెండు రజత పతకాలు వచ్చాయి.
కాగా.. పారా ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన అవని లేఖారాను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. 'నిజంగా ఇది భారత క్రీడా రంగానికి ప్రత్యేక క్షణం. మీ భవిష్యత్తు ప్రయత్నాలకు శుభాకాంక్షలు.' అని మోదీ ట్వీట్ చేశారు.
Next Story