ప్రేయ‌సిని పెళ్లాడిన మ‌హిళా క్రికెట‌ర్‌

Australian Women cricketer Jess Jonassen gets married to her best friend Sarah Gooderham. ఆస్ట్రేలియా మ‌హిళా క్రికెట్‌ ఆల్‌రౌండర్ జెస్ జోనాస్సెన్ త‌న ప్ర‌య‌సి సారా గూడెర్‌హామ్ శుక్రవారం వివాహం చేసుకుంది

By Medi Samrat
Published on : 14 April 2023 4:42 PM IST

ప్రేయ‌సిని పెళ్లాడిన మ‌హిళా క్రికెట‌ర్‌

Australian Women cricketer Jess Jonassen gets married to her best friend Sarah Gooderham


ఆస్ట్రేలియా మ‌హిళా క్రికెట్‌ ఆల్‌రౌండర్ జెస్ జోనాస్సెన్ త‌న ప్ర‌య‌సి సారా గూడెర్‌హామ్ ను వివాహం చేసుకుంది. 2018లోనే ఇద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. 2020లో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే కరోనా కారణంగా పెళ్లి ఆలస్యమైంది. జెస్ జోనాస్సెన్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో వివాహ వివరాలను, అందమైన చిత్రాలను పంచుకుంది.

జెస్ జోనాసెన్ తెల్లటి చొక్కా, బూడిద రంగు బ్లేజర్, ఆఫ్-వైట్ ప్యాంటులో కనిపించింది. "చివరికి మేము మూడవ ప్రయత్నంలో వివాహం చేసుకున్నాము. నా బెస్ట్ ఫ్రెండ్ ను నేను వివాహం చేసుకున్నాను. ఏప్రిల్ 6 నా హృదయానికి ద‌గ్గ‌రైంది" అని రాసుకొచ్చింది.

ప్రస్తుతం ఐపీఎల్ 2023 వ్యాఖ్యాత నెరోలి మెడోస్ ఇద్దరినీ అభినందించారు. బ్రిస్బేన్ హీట్ కూడా వారిద్దరి వివాహానికి అభినందనలు తెలిపింది. బిగ్ బాష్ లీగ్‌లో జోనాసెన్ వైట్ బ్రిస్బేన్ హీట్ తరఫున ఆడుతుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023లో.. జోనాసన్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడింది.




Next Story