వీడు సామాన్యుడు కాదు.. ఒకే ఓవర్‌లో 8 సిక్సర్లు బాదేశాడు

Australian batter smashes 8 sixes in an over.సాధార‌ణంగా క్రికెట్‌లో ఒక ఓవ‌ర్‌లో ఆరు బంతుల‌కు ఆరు సిక్స‌ర్లు కొట్ట‌డం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Oct 2021 4:25 PM IST
వీడు సామాన్యుడు కాదు.. ఒకే ఓవర్‌లో 8 సిక్సర్లు బాదేశాడు

సాధార‌ణంగా క్రికెట్‌లో ఒక ఓవ‌ర్‌లో ఆరు బంతుల‌కు ఆరు సిక్స‌ర్లు కొట్ట‌డం చాలా అరుదు. అలాంటిది ఓ బ్యాట్స్‌మెన్ ఏకంగా 8 సిక్స‌ర్లు బాదేశాడు. అదేంటి మీరు మా చెవుల్లో పూలు పెడుతున్నారా..? ఓవ‌ర్‌లో ఉండేవే 6 బంతులు అనేగా మీడౌట్‌. మీరు చెప్పింది నిజ‌మే కానీ.. ఆ బ్యాట్స్‌మెన్ దెబ్బ‌కు బౌల‌ర్ రెండు నో బాల్స్ కూడా వేశాడు. ఆ రెండింటిని కూడా సిక్స‌ర్లుగా మ‌లిచి.. దాదాపు ఎవ్వ‌రికి సాధ్యం కాని రికార్డును త‌న పేరును లిఖించుకున్నాడు ఆస్ట్రేలియా ఆట‌గాడు సామ్ హారిస్‌. అయితే.. ఇది అంత‌ర్జాతీయ మ్యాచ్‌లో కాదులెండి. క్ల‌బ్ క్రికెట్‌లో.

పెర్త్ వేదికగా సోర్రెంటో డంక్రైగ్ సీనియర్ క్లబ్, కింగ్‌స్లే వుడ్‌వాలే సీనియర్ క్లబ్ మ‌ధ్య‌ మ్యాచ్ జ‌రిగింది. సోర్రెంటో క్ల‌బ్ త‌రుపున హారిస్ ఆడుతున్నాడు. తొలుత సోర్రెంటో డంక్రైగ్ క్ల‌బ్ బ్యాటింగ్‌కు దిగింది. ఇన్నింగ్స్ 39 ఓవ‌ర్‌ను నాథ‌న్ బెన్నెట్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లో సామ్ హారిస‌న్ పెను విధ్వంస‌మే సృష్టించాడు. మ‌నోడి దెబ్బ‌కు బెన్నెట్ రెండు నో బాల్స్ కూడా వేశాడు. మొత్తం 8 బంతులు వేయ‌గా 8 బంతుల‌ను సిక్స‌ర్లుగా మ‌లిచాడు సామ్ హారిస‌న్‌. దాంతో ఈ ఓవ‌ర్‌లో మొత్తం 50 ప‌రుగులు వ‌చ్చాయి.

తొలుత బ్యాటింగ్ చేసిన సోరెంటో డంక్రైగ్ నిర్ణీత 40 ఓవర్లలో 276 పరుగులు చేసింది. అనంతరం 277 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కింగ్‌స్లే వుడ్‌వాలే 40 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 154 పరుగులకే ప‌రిమిత‌మైంది. దీంతో డంక్రైగ్ క్లబ్ 122 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ప్ర‌స్తుతం ఈ మ్యాచ్‌కు సంబంధించిన స్కోర్ కార్డు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.


Next Story