వరుణుడు కరుణించాడు. దీంతో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య విశాఖలో జరగాల్సిన రెండో వన్డే సకాలంలోనే ప్రారంభం కానుంది. వర్షం తగ్గి ఎండ రావడంతో మ్యాచ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రౌండ్ సిబ్బంది మైదానంలోని కవర్లు తొలగించి వర్షపు నీటిని బయటకు పంపించారు. దీంతో అనుకున్న సమయానికి టాస్ వేశారు. టాస్ గెలిచిన స్టీవ్ స్మిత్ మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. వర్షం కురవడంతో ఆరంభంలో పిచ్ బౌలర్లకు సహకరించే అవకాశం ఉండనుందే అంచనాలే అందుకు కారణం.
వ్యక్తిగత కారణాలతో తొలి వన్డేకు దూరం అయిన కెప్టెన్ రోహిత్ శర్మ వచ్చేశాడు. తొలి మ్యాచ్‌లో విఫలం అయిన ఇషాన్ కిషన్‌పై వేటు పడింది. శుభ్‌మన్ గిల్‌తో కలిసి రోహిత్ ఓపెనింగ్ చేయనున్నాడు.
భారత తుది జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ
ఆస్ట్రేలియా తుది జట్టు : ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్ , మార్నస్ లబుషేన్, అలెక్స్ కారీ(వికెట్‌కీపర్), కామెరాన్ గ్రీన్, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా