ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ప్యాటిన్సన్ సుధీర్ఘ ఫార్మెట్ కు గుడ్ బై చెప్పాడు. ఇంగ్లాండ్‌తో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ ముందు అతడు ఈ నిర్ణయం తీసుకోవడం ఆసీస్ అభిమానులను షాక్‌కు గురిచేసింది. ఎప్పుడో 2011లో ఆసీస్ తరుపున టెస్టు క్రికెట్‌లో అరగ్రేటం చేసిన ప్యాటిన్సన్ ఇప్పటి వరకు 21 టెస్టు మ్యాచ్‌లనే ఆడాడు. అతడి కెరీర్‌లో ఎక్కువగా అతడు మోకాలి గాయంతో ఇబ్బంది పడ్డాడు. అరగ్రేటం టెస్టులోనే ఐదు వికెట్లతో సత్తా చాటినా.. తరువాత మోకాలి గాయంతో రెగ్యులర్ జట్టులో చోటు కోల్పోయాడు.
గాయం కోలుకున్నప్పటికి మిచెల్ స్టార్క్, జోష్ హాజెల్‌వుడ్, పాట్ కమిన్స్ వంటి బౌలర్ల హవా కొనసాగడంతో అతడికి జట్టులో చోటు దక్కలేదు. వీరిలో ఎవరో ఒకరికి విశ్రాంతిని ఇచ్చినప్పుడు మాత్రమే ప్యాటిన్సన్ కు అవకాశం లభించేది. మొత్తంగా 21 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ప్యాటిన్సన్ 81 వికెట్లు పడగొట్టాడు. ఇందులో నాలుగు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. అతడి కెరీర్‌లో 2013 భారత పర్యటన చిరస్మరణీయంగా మిగిలింది. చెపాక్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్‌పై ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. చెన్నైలో ఓ ఆసీస్ ఫాస్ట్ బౌలర్ ఐదు వికెట్ల తీయడం అదే తొలిసారి. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020లో టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టులో ప్యాటిన్సన్ భాగమయ్యాడు.