టీ-20 ప్రపంచ కప్ నుండి ఆస్ట్రేలియా అవుట్ అయింది. లీగ్ మ్యాచ్ లలో జింబాబ్వే, శ్రీలంక చేతిలో ఓటమిని చవిచూసిన ఆస్ట్రేలియా జింబాబ్వే, ఐర్లాండ్ మ్యాచ్ కోసం ఎంతగానో ఎదురుచూసింది. ఈ మ్యాచ్ లో ఐర్లాండ్ గెలవాలని కోరుకుంది. కానీ ఊహించని విధంగా వరుణుడు ఆస్ట్రేలియా ఆశలపై నీటిని చల్లాడు. ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దయింది. దీంతో జింబాబ్వే, ఐర్లాండ్ జట్లకు చెరో పాయింట్ దక్కాయి. జింబాబ్వే సూపర్-8 కు అర్హత సాధించింది.
సూపర్ 8 కి టికెట్ పొందిన 7వ జట్టుగా జింబాబ్వే నిలిచింది. ఆస్ట్రేలియా, ఐర్లాండ్ జట్లు ఎలిమినేట్ అయ్యాయి. పల్లెకెలేలో వర్షం పడుతూ ఉండడంతో ఆట సాధ్యం కాదని తేలింది. కాబట్టి, సూపర్ 8 గ్రూప్ G1 అంతా తేలిపోయింది. భారత్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే జట్లు నిలిచాయి. మరోవైపు, శ్రీలంక, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్/యుఎస్‌ఎలలో ఒకటి సూపర్ 8 గ్రూప్ G2గా ఉండనున్నాయి.