ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియాకు శుభవార్త.. భారత్‌తో సిరీస్‌కు పాట్ కమిన్స్
వన్డే ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు ఊరటనిచ్చే వార్త తెరపైకి వచ్చింది.
By Medi Samrat Published on 15 Aug 2023 3:07 PM ISTవన్డే ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు ఊరటనిచ్చే వార్త తెరపైకి వచ్చింది. జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ ప్రపంచకప్‌కు ముందు వన్డే సిరీస్‌లో ఆడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యాషెస్ టెస్టు సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో కమిన్స్ గాయపడ్డాడు. గాయంతోనే మ్యాచ్ మొత్తం ఆడాడు. అతని ఎడమ మణికట్టు ఫ్రాక్చర్ అయ్యింది. అయితే కమిన్స్ భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌లో ఆడగలడని అంటున్నారు.
ఎడమ మణికట్టు గాయం నుండి కోలుకుంటున్న ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ మంగళవారం మాట్లాడుతూ.. ప్రపంచ కప్‌కు ముందు సెప్టెంబర్ చివరలో భారత్‌తో ఆస్ట్రేలియా జట్టు మూడు మ్యాచ్‌ల ODI సిరీస్ ఆడుతుందని తెలిపాడు. ఓవల్‌లో యాషెస్ ఐదవ టెస్టు సందర్భంగా మణికట్టు విరగడంతో డాక్టర్లు ఆరు వారాల విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించినట్లు పేర్కొన్నాడు.
పాట్ కమిన్స్ సెప్టెంబర్ 7 నుంచి 17 వరకు దక్షిణాఫ్రికాతో జరిగే ఐదు వన్డేల సిరీస్‌కు దూరం కానున్నాడు. సెప్టెంబర్ 22, 24, 27 తేదీల్లో భారత్‌తో ఆస్ట్రేలియా వన్డేలు ఆడనుంది. కమిన్స్ మాట్లాడుతూ.. "నేను టోర్నీ చివరిలో దక్షిణాఫ్రికాకు వెళ్తాను. అయితే ప్రపంచకప్‌కు ముందు భారత్‌పై వన్డే సరీస్‌పై మేము ఎక్కువగా దృష్టి పెడతామన్నాడు.
అక్టోబరు 5 నుంచి నవంబర్ 19 వరకు భారత్‌లో జరగనున్న ప్రపంచకప్‌లో ఆడగలనని కమిన్స్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రపంచకప్ తర్వాత వన్డే కెప్టెన్‌గా తన పాత్రను అంచనా వేస్తానని కమిన్స్ చెప్పాడు. వన్డేలకు కెప్టెన్సీ గురించి కొన్ని విషయాలు పంచుకున్నామని.. అక్కడికి వెళ్లి పరిశీలిస్తామని చెప్పాడు. ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్‌గా నియమితుడైన మిచెల్ మార్ష్ అతని స్థానంలో వన్డే కెప్టెన్‌గా ఎంపికయ్యాడని కమిన్స్ అన్నాడు.
మిచెల్ మార్ష్ టీ20లలో కూడా ఆడుతున్నందున అతను చాలా స్పష్టమైన ఎంపిక కావచ్చు. మైదానం వెలుపల, అతను గొప్ప వ్యక్తి. అతని శక్తి చాలా గొప్పది. అతనితో ఉండటం చాలా బాగుంటుంది. ఎల్లప్పుడూ సరదాగా ఉంటుందని అన్నాడు. గత సంవత్సరం ఆరోన్ ఫించ్ నుండి కమిన్స్ ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు.