యాషెస్ సిరీస్‌కు ఆసీస్ జట్టు ఎంపిక.. టీ20 ప్రపంచకప్ హీరోకు దక్కని చోటు
Australia announce Ashes squad.క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాషెస్ సిరీస్
By తోట వంశీ కుమార్
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాషెస్ సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది. డిసెంబర్ 8 నుంచి వచ్చే ఏడాది జనవరి 18 వరకు ఈ సిరీస్ జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ దక్కించుకునేందుకు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు సిద్దం అవుతున్నాయి. ఈ సిరీస్‌లో ఐదు టెస్టు మ్యాచ్‌లు జరగనుండగా.. తొలి రెండు టెస్టులకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టులో టీ20 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియాకు అందించిన హీరో మార్ష్‌కు చోటు దక్కలేదు. రెండేళ్ల తరువాత సీనియర్ ఆటగాడు ఉస్మాన్ ఖవాజాను జట్టులోకి తీసుకున్నారు.
ఆస్ట్రేలియా జట్టు ఇదే..
టిమ్ పైన్ (కెప్టెన్), పాట్ కమిన్స్(వైస్ కెప్టెన్), డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, కామెరాన్ గ్రీన్, మార్కస్ హారిస్, జోష్ హేజిల్‌వుడ్, మార్నస్ లబుషేన్ , నాథన్ లియాన్, మైఖేల్ నేజర్, జో రిచర్డ్‌సన్, మిచెల్ స్టార్క్, మిచెల్ స్పెప్సన్
Ready, set, #Ashes!
— cricket.com.au (@cricketcomau) November 17, 2021
Check out all the details including the Australia A players here: https://t.co/cEJaMO8ru2 pic.twitter.com/Sa7RFS4WxL
యాషెస్ షెడ్యూల్ :
తొలి టెస్టు : డిసెంబర్ 8-12 (గబ్బా)
రెండో టెస్టు : డిసెంబర్ 16-20 (అడిలైడ్)
మూడో టెస్టు : డిసెంబర్ 26-30 (మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్)
నాలుగో టెస్టు : జనవరి 5-9 (సిడ్నీ)
ఐదో టెస్టు : జనవరి 14-18(పెర్త్)
యాషెస్ సిరీస్‌కు ఆ పేరు ఎలా వచ్చిందంటే
1882లో ఓవల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో గెలవాల్సిన ఇంగ్లాండ్ జట్టు ఆస్ట్రేలియా చేతిలో అనూహ్యంగా ఓడింది. కాగా.. ఇంగ్లాండ్ గడ్డపై ఆస్ట్రేలియాకు ఇదే తొలి విజయం. దీన్ని జీర్ణించుకోలేని ఓ వార్త పత్రిక క్రికెట్ చచ్చిపోయిందనే ఉద్దేశ్యంతో.. అంత్యక్రియలు జరుపగా వచ్చిన యాషెస్(బూడిద)ను ఆసీస్ తీసుకెళ్తున్నారంటూ రాసుకొచ్చింది. ఇక 1883లో ఇంగ్లాండ్ జట్టు ఆసీస్ పర్యటనకు వెళ్లినప్పుడు ఆ యాషెస్ ను తిరిగి తీసుకురావాలంటూ చాలా పత్రికలు రాశాయి. అప్పటి నుంచి ఈ సిరీస్‌కు యాషెస్ అనే పేరు స్థిరపడింది. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య 71 సార్లు యాషెస్ కోసం తలపడగా.. ఆస్ట్రేలియా 33 సార్లు ఇంగ్లాండ్ 32 సార్లు గెలుపొందాయి. ఆరు సిరీస్‌లు మాత్రమే డ్రా అయ్యాయి. ఇక 2019లో జరిగిన సిరీస్‌ను ఆసీస్ గెలుచుకుంది.