ప్రేయసితో నిశ్చితార్థం చేసుకున్న అసీస్ మహిళా క్రికెటర్
ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ ఆష్లే గార్డనర్ తన స్నేహితురాలు మోనికాతో నిశ్చితార్థం చేసుకుంది.
By - Medi Samrat |
ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ ఆష్లే గార్డనర్ తన స్నేహితురాలు మోనికాతో నిశ్చితార్థం చేసుకుంది. ఇద్దరూ చాలా కాలంగా ఒకరితో ఒకరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. గార్డనర్ ఎంగేజ్‌మెంట్ వార్తలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులను ఆశ్చర్యపరింది. మోనికాతో ఎంగేజ్‌మెంట్ చిత్రాన్ని పంచుకుంటూ.. 'మిసెస్ గార్డనర్‌కి అందమైన ఉంగరం ఉంది' అని రాసింది.
స్టార్ ప్లేయర్ ఆష్లే గార్డనర్ 19 ఏప్రిల్ 2024న తన స్నేహితురాలు మోనికాతో తన నిశ్చితార్థాన్ని అధికారికంగా ప్రకటించింది. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్, రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ గార్డనర్ ఉమెన్స్ నేషనల్ క్రికెట్ లీగ్ (WNCL)లో న్యూ సౌత్ వేల్స్ తరఫున, ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ (WBBL)లో సిడ్నీ సిక్సర్స్, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)లో గుజరాత్ జెయింట్స్ తరఫున ఆడుతుంది. ఇటీవల యాష్లే గార్డనర్‌ను బెలిండా క్లార్క్ అవార్డుతో సత్కరించారు.
యాష్లే గార్డనర్ 2021 నుంచి మోనికాతో రిలేషన్ షిప్‌లో ఉంది. 2023 T20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత యాష్లే గార్డనర్ మోనికాతో తన వివాహాన్ని ప్రకటించింది. మోనికా కంటే ముందు యాష్లే గార్డనర్ బ్రిడ్జేట్ ప్యాటర్సన్‌తో రిలేషన్ కలిగి ఉంది. మోనికా సమాచారం పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో లేకపోవడం గమనార్హం.
ఆష్లే గార్డనర్ ఆస్ట్రేలియా తరఫున 6 టెస్టు మ్యాచ్‌ల్లో 281 పరుగులు చేయడంతో పాటు 23 వికెట్లు కూడా పడగొట్టింది. 69 వన్డే మ్యాచ్‌లలో 973 పరుగులు చేయడంతో పాటు 89 వికెట్లు తీసింది. ఆష్లే గార్డనర్ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఆస్ట్రేలియా తరఫున 88 మ్యాచ్‌లు ఆడింది. 68 వికెట్లు తీయడంతోపాటు 1,329 పరుగులు చేసింది.