ఉమేశ్, అశ్విన్ ఫైర్‌.. ఆస్ట్రేలియా 197 ఆలౌట్‌

మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 197 ప‌రుగుల‌కు ఆలౌటైంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 March 2023 6:27 AM GMT
Border-Gavaskar Trophy, India vs Aus 3rd Test

Ashwin


బోర్డ‌ర్ – గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా ఇండోర్ వేదిక‌గా జ‌రుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 197 ప‌రుగుల‌కు ఆలౌటైంది. దీంతో ఆసీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 88 ప‌రుగుల ఆధిక్యం ల‌భించింది.

ఓవ‌ర్ నైట్ స్కోర్ 156/ 4 తో రెండో రోజు ఆట‌ను కొన‌సాగించిన ఆసీస్ మ‌రో 41 ప‌రుగులు మాత్ర‌మే జోడించి మిగిలిన ఆరు వికెట్లు కోల్పోయింది. తొలి రోజు నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టిన జ‌డేజా రెండో రోజు ఒక్క వికెట్ కూడా తీయ‌లేక‌పోయాడు. అయితే.. ఉమేశ్ యాద‌వ్‌, అశ్విన్‌లు ఆసీస్ బ్యాట‌ర్ల‌కు చుక్క‌లు చూపించారు. వీరిద్ద‌రి విజృంభ‌ణ కార‌ణంగా ఆసీస్ 197 ప‌రుగుల‌కే ఆలౌటైంది. ఆసీస్ బ్యాట‌ర్ల‌లో ఉస్మాన్‌ ఖవాజా (60) అర్థ‌శ‌త‌కంతో రాణించ‌గా లబుషేన్‌ (31), స్టీవ్‌ స్మిత్‌ (26) ఫ‌ర్వాలేద‌నిపించారు. భార‌త్ బౌల‌ర్ల‌లో జ‌డేజా నాలుగు తీయ‌గా ఉమేశ్ యాద‌వ్, అశ్విన్‌లు చెరో మూడు వికెట్లు ప‌డ‌గొట్టారు. టీమ్ఇండియా త‌న తొలి ఇన్నింగ్స్‌లో 109 ప‌రుగుల‌కు ఆలౌట్ అయిన సంగ‌తి తెలిసిందే.

88 ప‌రుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమ్ఇండియా రెండో రోజు లంచ్ బ్రేక్ స‌మ‌యానికి వికెట్ న‌ష్ట‌పోకుండా 13 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ 5, శుభ్‌మ‌న్ గిల్ 4 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

Next Story