ఆస్ట్రేలియా ఘన విజయం.. 400 వికెట్ల క్లబ్‌లో నాథన్ లియాన్
Aussies win first Test against England by 9 wickets.ప్రతిష్టాత్మక యాషెస్ట్ టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు శుభారంభం
By తోట వంశీ కుమార్ Published on 11 Dec 2021 12:59 PM ISTప్రతిష్టాత్మక యాషెస్ట్ టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు శుభారంభం చేసింది. గబ్బా వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ నిర్దేశించిన 19 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 5.1 ఓవర్లలో వికెట్ కోల్పోయి చేదించింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన ట్రావిస్ హెడ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
అంతకు ముందు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్(5/38) ఐదు వికెట్లతో చెలరేగడంతో ఇంగ్లండ్ 147 పరుగులకే కుప్పకూలింది. జోస్ బట్లర్ (39), ఓలి పోప్ (35), హసీబ్ హమీద్ (25), క్రిస్ వోక్స్ (21) మాత్రమే ఓ మోస్తారుగా రాణించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఆసీస్ 425 పరుగులకు ఆలౌట్ అయింది. ట్రావిస్ హెడ్(148 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 152) ధనాధన్ సెంచరీకి.. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (176 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 94), లబూషేన్(117 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 74) రాణించారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌కు 278 పరుగుల ఆధిక్యం లభించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్, రాబిన్సన్ చెరో మూడు వికెట్లు తీశారు. భారీ పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లాండ్ 297 పరుగులకు ఆలౌట్ కావడంతో ఆసీస్ ముందు స్వల్ప లక్ష్యం నిలిచింది.
400 వికెట్ల క్లబ్‌లో నాథన్ లియాన్..
తొలి టెస్టులో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. డేవిడ్ మలన్‌ను ఔట్ చేసి 400 వికెట్ల క్లబ్‌లో చేరాడు. ఆస్ట్రేలియా తరుపున 101వ టెస్టు ఆడుతున్న లియాన్.. 400 వికెట్లు తీసిన 16వ బౌలర్‌గా నిలిచాడు. షేన్‌వార్న్, మెక్‌గ్రాత్ తరువాత ఆస్ట్రేలియా తరుపున ఈ ఘనత అందుకున్న బౌలర్‌గా లియాన్ నిలిచాడు. ఇక టెస్టు క్రికెట్‌లో శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ అత్యధికంగా 800 వికెట్లు తీశాడు. ఆ తర్వాత స్థానల్లో షేన్ వార్న్ (708), జిమ్మీ అండర్సన్ (632), స్టువర్ట్ బ్రాడ్ (524) ఉన్నారు.