క్షమాపణలు చెప్పిన ఆసీస్ కెప్టెన్..!
Aussie skipper Tim Paine apologises for sledging Ashwin. ఇంటర్నేషనల్ మ్యాచ్ లలో కెప్టెన్లు ఎంతో హుందాగా ప్రవర్తిస్తూ ఉంటారు.క్షమాపణలు చెప్పిన ఆసీస్ కెప్టెన్.
By Medi Samrat Published on 12 Jan 2021 4:49 PM ISTఇంటర్నేషనల్ మ్యాచ్ లలో కెప్టెన్లు ఎంతో హుందాగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ సిడ్నీ టెస్ట్ లో మాత్రం ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ వక్ర బుద్ధిని ప్రదర్శించాడు. అశ్విన్ మీదా, హనుమ విహారి మీద ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేస్తూ గడిపేశాడు. తాను చేసిన తప్పును తెలుసుకున్న టిమ్ పైన్ మ్యాచ్ ముగిసిన అనంతరం క్షమాపణలు చెప్పాడు.
నేనో మనిషిని, నేను చేసిన తప్పులకు క్షమాపణ చెప్పాలని అనుకుంటున్నానని టిమ్ పైన్ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా టీమ్‌ను లీడ్ చేయడాన్ని నేను ఎప్పుడూ గర్వంగా ఫీలవుతాను. కానీ సిడ్నీ టెస్ట్ చివరి రోజు మాత్రం అలా జరగలేదని అన్నాడు. టీమ్‌ను సరిగా లీడ్ చేయలేకపోయానని.. మ్యాచ్ తాలూకు ఒత్తిడిని అధిగమించలేపోయానని అన్నాడు. అది నా ఆటపై ప్రభావం చూపిందని.. లీడర్‌గా ఇది నాకు దారుణమైన మ్యాచ్ అని నా టీమ్ మేట్స్‌తో చెప్పానని పైన్ తెలిపాడు. ఐదో రోజు ఆట ముగిసిన తర్వాత కూడా అశ్విన్‌తో తాను మాట్లాడినట్లు తెలిపాడు. నేనో ఫూల్‌గా వ్యవహరించాను కదా అని అశ్విన్‌తో తాను చెప్పానని తెలిపాడు చివరి రోజు మ్యాచ్‌లో మూడు క్యాచ్‌లు జారవిడిచాడు పైన్. అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసినందుకు అతనికి మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించారు. ఆసీస్ ఆటగాళ్లు ఎంతగా కవ్వించినా అశ్విన్, విహారి మాత్రం లైట్ గా తీసుకున్నారు. మ్యాచ్ ను డ్రా చేశారు.
407 పరుగుల ఛేదనలో టీమిండియా 250/4తో నిలిచిన దశలో క్రీజులోకి వచ్చిన హనుమ విహారి (23 నాటౌట్: 161 బంతుల్లో 4x4) చివరి వరకూ సహనంతో బ్యాటింగ్ చేశాడు. తొడ కండరాల గాయం వేధించినా, ఆస్ట్రేలియా ఫీల్డర్లు పదే పదే స్లెడ్జింగ్ కూడా చేశారు. అశ్విన్ (39 నాటౌట్: 128 బంతుల్లో 7x4)తో కలిసి దాదాపు మూడు గంటలకిపైగా క్రీజులో నిలిచిన హనుమ విహారి గొప్ప పోరాటాన్ని చేశాడు.
తొలి ఇన్నింగ్స్‌లో 38 బంతులాడిన హనుమ విహారి లేని పరుగు కోసం ప్రయత్నిస్తూ 4 పరుగుల వద్ద రనౌటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం అతడు అద్భుతమైన డిఫెన్స్ చూపించాడు.