ఒక్కొక్కరే టోర్నీ నుంచి నిష్క్రమిస్తున్నారు.. వార్నర్‌, స్మిత్, మాక్స్‌వెల్ కూడా..!

Aussie cricketers also may go back.ఇంటికి వెళ్లిపోవాల‌ని వార్న‌ర్‌, స్మిత్ స‌హా ఇత‌ర ఆస్ట్రేలియా ప్లేయ‌ర్స్ భావిస్తున్నార‌ని న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్ వెల్ల‌డించింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 April 2021 5:31 AM GMT
Australia cricketers

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) 2021 సీజ‌న్ లో ఇంకా స‌గం మ్యాచ్‌లు కూడా కంప్లీట్ కాలేదు. ఇప్ప‌టికే అభిమానుల‌కు కావాల్సిన వినోదాన్ని అందిస్తున్నాయి. బ్యాట్స్‌మెన్ల మెరుపు అర్థ‌శ‌త‌కాలు, కీల‌క స‌మ‌యాల్లో బౌల‌ర్ల విజృంభ‌ణ‌, ఫీల్డ‌ర్ల అద్భుత విన్యాసాల‌తో మ్యాచ్‌లు ఆస‌క్తిక‌రంగా సాగుతున్నాయి. ఇప్ప‌టికే ఓ సూప‌ర్ ఓవ‌ర్ మ్యాచ్‌ను కూడా చూశాం. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు బాగానే ఉన్నా.. క్ర‌మంగా ఈ సీజ‌న్ క‌ళ‌త‌ప్ప‌నుందా..? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది.

ఇప్ప‌టికే ఒక్కొక్కరుగా ఆట‌గాళ్లు ఈ లీగ్‌ను విడిచి వెలుతున్నారు. దేశంలో నెల‌కొన్న క‌రోనా ప‌రిస్థితులు ప‌లువురు క్రికెట‌ర్ల‌కు భ‌యాందోళ‌న‌కు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా విదేశీ ఆట‌గాళ్ల‌ను. ఇదివరకు ఆండ్రూ టై, ఆ తరువాత స్టార్ స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్.. అర్ధాంతరంగా ఈ మెగా క్రికెట్ టోర్నమెంట్ నుంచి తప్పుకొన్నారు. ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్‌దీ అదే పరిస్థితి. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌ని చెప్పి ఆర్సీబీ ప్లేయ‌ర్స్ వెళ్లిపోయినా ఆస్ట్రేలియా ప్లేయ‌ర్స్‌లో ఒక ర‌క‌మైన ఆందోళ‌న నెల‌కొన్న‌ద‌ని ఆ దేశానికి చెందిన నైట్‌రైడ‌ర్స్ మెంటార్ డేవిడ్ హ‌స్పీ చెప్పాడు.

క‌రోనా సెకండ్ వేవ్‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ఇండియా నుంచి వ‌చ్చే అన్ని విమానాల‌ను నిలిపేయాల‌ని ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం భావిస్తున్న‌ట్లు అక్కడి మీడియా చెబుతోంది. అది జ‌ర‌గ‌క ముందే ఇంటికి వెళ్లిపోవాల‌ని వార్న‌ర్‌, స్మిత్ స‌హా ఇత‌ర ఆస్ట్రేలియా ప్లేయ‌ర్స్ భావిస్తున్నార‌ని న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్ వెల్ల‌డించింది. డేవిడ్ వార్నర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా.. స్టీవ్ స్మిత్ ఢిల్లీ కేపిటల్స్ తరఫున ఆడుతున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో గ్లెన్ మ్యాక్స్‌వెల్ కీలక బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు.

ఒక‌వేళ వీళ్లు వెళ్లిపోతే.. మిగ‌తా దేశాల‌కు చెందిన ఆట‌గాళ్లు ఐపీఎల్ వీడేందుకే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. మరీ బీసీసీఐ (భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు) ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలీ మ‌రీ.




Next Story