Asian Games: నీరజ్‌కు స్వర్ణం.. 81కి చేరిన భారత్ పతకాలు
ఆసియా క్రీడల్లో భారత్ పతకాల పంట కొనసాగుతోంది. ఇప్పటి వరకు భారత్ మొత్తం 81 పతకాలను సాధించింది.
By Srikanth Gundamalla
Asian Games: నీరజ్‌కు స్వర్ణం.. 81కి చేరిన భారత్ పతకాలు
ఆసియా క్రీడల్లో భారత్ పతకాల పంట కొనసాగుతోంది. భారతీయ క్రీడాకారులు జోరుని కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు భారత్ మొత్తం 81 పతకాలను సాధించింది. ఇందులో 18 బంగారు పతకాలు ఉండగా.. 31 రజత పతకాలు, 32 కాంస్య పతకాలు ఉన్నాయి. తాజాగా ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం వచ్చి చేరింది.
త ఏషియన్ గేమ్స్‌లో ఇదే ఈవెంట్‌లో స్వర్ణం సాధించిన నీరజ్.. ఈసారి జావెలిన్‌ను 88.88 మీటర్లు విసిరి స్వర్ణాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ ఈవెంట్‌లో రజతం సాధించిన కిషోర్ 87.54 మీటర్లు జావెలిన్‌ను విసిరి, నీరజ్‌కు గట్టి పోటీ ఇచ్చాడు. ఈ ప్రదర్శనతో నీరజ్, కిషోర్ ఇద్దరు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. పురుషుల 4×400 మీటర్ల రిలే ఫైనల్‌లో మహ్మద్ అనస్ యాహియా, అమోజ్ జాకబ్, మహ్మద్ అజ్మల్, రాజేష్ రమేష్ బృందం స్వర్ణ పతకం సాధించింది. 3 నిమిషాల 01.58 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని అగ్రస్థానంలో నిలిచింది. మహిళల 4×400 మీటర్ల రిలే ఫైనల్‌లో విద్య రామ్‌రాజ్, ఐశ్వర్య మిశ్రా, ప్రాచీ, సుభా వెంకటేశన్ బృందం (3 నిమిషాల 27.65 సెకన్లు) రెండో స్థానంలో నిలిచి రజత పతకం అందుకుంది.
మరోవైపు 5వేల మీటర్ల ఫైనల్‌లో అవినాశ్ ముకుంద్ సాబలే రజత పతకం సాధించాడు. 18 నిమిషాల 21.09 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని రెండో స్థానంలో నిలిచాడు. కాగా.. అవినాశ్‌కు ఇది రెండో పతకం. అంతకుముందు 3వేల మీటర్ల పరుగులో స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. ఇక మహిళల 800 మీటర్ల ఫైనల్‌లో హర్మిలన్ రజత పతకం సొంతం చేసుకుంది. 1500 మీటర్ల ఈవెంట్‌లోనూ హర్మిలన్ రజతం గెలచుకుంది. పురుషుల గ్రీకో-రోమన్ రెజ్లింగ్ 87 కిలోల విభాగంలో సునీల్ కుమార్ కాంస్య పతకం సాధించాడు. హాకీలో భారత మెన్స్ టీమ్ సెమీస్‌లో కొరియాను 5-3 తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరింది.