ఆఫ్ఘన్ చేతిలో ఓటమి పాలైన పాకిస్థాన్

ఆసియా క్రికెట్ క్రీడల్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ ఓటమి పాలైంది.

By Medi Samrat  Published on  6 Oct 2023 1:16 PM GMT
asian games-2023, pak loss, semis, afghan,  final,

ఆఫ్ఘన్ చేతిలో ఓటమి పాలైన పాకిస్థాన్

ఆసియా క్రికెట్ క్రీడల్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ ఓటమి పాలైంది. ఆఫ్ఘనిస్తాన్ జట్టు అద్భుతమైన ఆల్ రౌండ్ ప్రదర్శనతో పాకిస్థాన్ ను ఓడించింది. ఈ మ్యాచ్లో తొలిత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 18 ఓవర్లలో 115 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. 24 పరుగులు చేసిన ఒమైర్ యూసఫ్ పాక్ జట్టులో టాప్ స్కోరర్. ఆఫ్ఘన్ బౌలర్లలో ఫరీద్ అహ్మద్ 3 వికెట్లు తీసుకోగా, కాయిస్ అహ్మద్, జహీర్ ఖాన్ చెరో 2 వికెట్లు తీసుకున్నారు. అనంతరం 116 పరుగుల లక్ష్యాన్ని ఆఫ్ఘనిస్తాన్ బాటర్లు 6 వికెట్లు కోల్పోయి ఛేదించారు. నూర్ అలీ జార్డాన్ 39 పరుగులతో రాణించగా.. గుల్బుద్దీన్ నయిబ్ 26 పరుగులు చేశాడు. ఈ విజయంతో ఆఫ్గనిస్తాన్ జట్టు ఫైనల్ చేరగా.. స్వర్ణం కోసం అక్టోబర్ 7న భారత్ తో తలపడనుంది.

ఆసియా క్రీడల్లో భారత మెన్స్‌ క్రికెట్‌ టీమ్‌ ఫైనల్‌కు చేరుకుంది. సెమీస్‌లో బంగ్లాదేశ్‌ను టీమిండియా 9 వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ 96 పరుగులు చేసింది. అనంతరం రంగంలోకి దిగిన భారత్‌ కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి 9.2 ఓవర్లలో 97 పరుగులు చేసి ఘనవిజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో తెలుగు తేజం తిలక్‌ వర్మ రాణించాడు. 50 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రుతురాజ్‌ గైక్వాడ్‌ (40 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.

Next Story