భారత్ రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్ అద్భుతమైన సెంచరీతో కదంతొక్కాడు. అశ్విన్ సెంచరీ, కెప్టెన్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించడంతో భారత్ రెండో ఇన్నింగ్స్ లో 286 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ 481 పరుగుల లీడ్ ను సాధించింది. మూడో రోజు ఆటలో అశ్విన్ ఆట తీరు హైలైట్ గా నిలిచింది. టీమ్ ఇండియా రెండో ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ (26), శుభ్‌మన్ గిల్ (14), విరాట్ కోహ్లి (149 బంతుల్లో 62; 7ఫోర్లు), అక్సర్ పటేల్(7), రహానె(10), రిషభ్ పంత్ (8), పుజారా (7), రవిచంద్రన్ అశ్విన్ (148 బంతుల్లో 106 పరుగులు), కుల్దీప్ (3), ఇషాంత్ శర్మ (7) చేయగా.. సిరాజ్ 21 బంతుల్లో 16 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. సిరాజ్ బాదిన రెండు భారీ సిక్సర్లు గ్రౌండ్ లో అభిమానులను అలరించాయి. జాక్ లీక్, మొయిన్ అలీ చెరో నాలుగు వికెట్లు తీశారు. ఓలీ స్టోన్ ఒక వికెట్ తీశాడు.
మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 134 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే..! పిచ్ స్పిన్నర్లకు బాగా అనుకూలిస్తూ ఉంది. ఇక ముగ్గురు స్పిన్నర్లు ఉన్న భారత్ ను ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఇంకో రెండు రోజుల పాటూ తట్టుకుని నిలబడతారా లేదా అన్నది ప్రశ్నార్థకమే..! అద్భుతం జరిగితే కానీ ఇంగ్లాండ్ ఈ పిచ్ మీద విజయం సాధించడం జరగదు అని క్రికెట్ నిపుణులు చెబుతూ ఉన్నారు.