ఢిల్లీ కాపిటల్స్‌కు గ‌ట్టి షాక్.. ఐపీఎల్ నుంచి త‌ప్పుకున్న అశ్విన్‌

Ashwin takes a break from IPL to support family in fight against Covid-19.అశ్విన్ ట్విట్టర్ వేదిక‌గా ఐపీఎల్‌కు దూర‌మ‌వుతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.

By Medi Samrat  Published on  26 April 2021 3:38 AM GMT
Ashwin takes break from IPL

ఢిల్లీ కాపిటల్స్ కు గ‌ట్టి షాక్ త‌గిలింది. జ‌ట్టులో అత్యంత కీలకమైన స్పిన్నర్ గా ఉన్న రవిచంద్రన్ అశ్విన్.. ఐపీఎల్ లో త‌దుప‌రి మ్యాచ్‌ల‌కు దూరమవ‌నున్నాడు. ఈ మేర‌కు రవిచంద్రన్ అశ్విన్ ట్వీట్ చేశాడు. ఆదివారం జ‌రిగిన‌ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జ‌ట్టుపై సూపర్ ఓవర్ లో ఢిల్లీ కాపిటల్స్ గెలిచింది. ఈ మ్యాచ్ అనంత‌రం అశ్విన్ ట్విట్టర్ వేదిక‌గా ఐపీఎల్‌కు దూర‌మ‌వుతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.

నా కుటుంబీకులు, బంధువులు, కొవిడ్-19పై పోరాడుతున్నారు. ఈ కష్ట సమయంలో వారికి నేను అండగా నిలవాల్సిన అవసరం ఉంది. అందుకే రేప‌టి నుండి ఈ ఏడాది ఐపీఎల్ నుంచి విరమించుకుంటున్నాను. పరిస్థితులన్నీ చక్కబడితే తిరిగి పోటీల్లోకి వస్తాను. ధన్యవాదాలు ఢిల్లీ కాపిటల్స్ అని అశ్విన్‌ ట్వీట్ చేశాడు.

అశ్విన్ ట్వీట్ పై ఢిల్లీ కాపిటల్స్ స్పందించింది. మీ కుటుంబం కష్టాల్లో ఉన్న వేళ మా మద్దతు పూర్తిగా ఉంటుంది. ఢిల్లీ కాపిటల్స్ తరఫున మీ కుటుంబానికి మా మద్దతు ఉంటుంది. మీ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాం అని పేర్కొంది. ఇదిలావుంటే.. అశ్విన్ నిన్నటి మ్యాచ్ లో నాలుగు ఓవర్లు వేసి 27 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేదు. ఏదేమైనా సీనియ‌ర్ స్పిన్న‌ర్ జ‌ట్టుకు దూర‌మ‌వ‌డం జ‌ట్టుకు నిజంగా లోటే.. ఈ స్థానాన్ని ఢిల్లీ కాపిట‌ల్స్ ఎవ‌రితో భ‌ర్తీ చేయ‌నుందో వేచిచూడాలి మ‌రి.


Next Story
Share it