ఆల్ రౌండ్ షోతో ఆకట్టుకున్న అర్జున్ టెండూల్కర్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్న అర్జున్ టెండూల్కర్, మధ్యప్రదేశ్‌తో జరిగిన సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో గోవా తరపున అద్భుతమైన ఆల్ రౌండ్ ప్రదర్శన చేశాడు.

By -  Medi Samrat
Published on : 2 Dec 2025 7:30 PM IST

ఆల్ రౌండ్ షోతో ఆకట్టుకున్న అర్జున్ టెండూల్కర్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్న అర్జున్ టెండూల్కర్, మధ్యప్రదేశ్‌తో జరిగిన సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో గోవా తరపున అద్భుతమైన ఆల్ రౌండ్ ప్రదర్శన చేశాడు. దేశవాళీలో ముంబై నుండి గోవాకు మారాడు అర్జున్‌. 2026 సీజన్ వేలానికి ముందు ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ నుండి లక్నో సూపర్ జెయింట్స్‌కు వెళ్లాడు.

రజత్ పాటిదార్ నేతృత్వంలోని మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జున్ 4 ఓవర్లలో 36 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు. ఓపెనర్లు అంకుష్ సింగ్, శివాంగ్ కుమార్, వెంకటేష్ అయ్యర్‌ల వికెట్లను అర్జున్ పడగొట్టాడు. ఇక అర్జున్ గోవా తరపున ఓపెనింగ్ స్థానంలో బ్యాటింగ్ ప్రారంభించాడు, 10 బంతుల్లో మూడు బౌండరీలతో 16 పరుగులు చేశాడు. అర్జున్ ఆల్ రౌండ్ ప్రదర్శన కారణంగా ఇంకా 9 బంతులు మిగిలి ఉండగానే మధ్యప్రదేశ్ పై గోవా 7 వికెట్ల విజయం అందుకుంది.

Next Story