అర్జున్ టెండూల్కర్‌కు మళ్లీ నిరాశే
Arjun Tendulkar not included in Mumbai squad for Ranji Trophy knockout matches.క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్
By తోట వంశీ కుమార్
క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌కు మళ్లీ నిరాశే మిగిలింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2022 సీజన్‌లో ఒక్క మ్యాచ్ ఆడకుండా బెంచ్‌కే పరిమితమైన అర్జున్‌కు ముంబై రంజీ ట్రోఫీ జట్టులోనూ చోటు దక్కలేదు. జూన్‌లో జరిగే నాకౌట్ రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో పాల్గొనే ముంబై జట్టును తాజాగా ప్రకటించారు. ముంబై జట్టుకు పృథ్వీ షా సారథ్యం వహించనున్నాడు. బెంగళూరు వేదికగా ఉత్తరాఖండ్ తో ముంబై తలపనుంది.
ఇక గాయం కారణంగా సీనియర్ ఆటగాడు రహానే ఈ మ్యాచ్‌కు దూరంగా కాగా.. యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, అర్మాన్ జాఫర్ (వసీం జాఫర్ మేనల్లుడు), ధావల్ కులకర్ణి, తుషార్ దేశ్‌పాండే తదితరులు జట్టులో చోటు దక్కించుకున్నారు.
కాగా.. ముంబై తరుపున టీ20ల్లో అరగ్రేటం చేశాడు అర్జున్. ఈ సీజన్ నాకౌట్ మ్యాచ్ ద్వారా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి కూడా ఎంట్రీ ఇవ్వాలని బావించగా.. అతడి ఆశలపై సెలక్టర్లు నీళ్లు చల్లారు.
ముంబై రంజీ జట్టు : పృథ్వీ షా(కెప్టెన్), అర్మాన్ జాఫర్, సర్ఫరాజ్ ఖాన్, యశస్వి జైస్వాల్, భూపేన్ లాల్వానీ, సువేద్ పార్కర్, ఆకర్షిత్ గోమల్, ఆదిత్య తారే, హార్ధిక్ తమోర్, అమాన్ ఖాన్, సాయిరాజ్ పాటిల్, షమ్స్ ములానీ, దృమిల్ మట్కర్, తనుష్ కోటియాన్, శశాంక్ అతార్డే, సిద్ధార్థ్ రౌత్, ముషీర్ ఖాన్, ధవల్ కులకర్ణి, తుషార్ దేశ్‌పాండే, మోహిత్ అవస్తీ, రొస్తాన్ డయాస్.