సుదీర్ఘ నిరీక్ష‌ణ ముగిసింది.. అర్జున్ టెండూల్కర్ టీమ్‌లోకి వ‌చ్చేశాడు..!

Arjun Tendulkar makes IPL debut. ఐపీఎల్ 2023 22వ మ్యాచ్ ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతోంది.

By Medi Samrat  Published on  16 April 2023 10:28 AM GMT
సుదీర్ఘ నిరీక్ష‌ణ ముగిసింది.. అర్జున్ టెండూల్కర్ టీమ్‌లోకి వ‌చ్చేశాడు..!

Arjun Tendulkar makes IPL debut


ఐపీఎల్ 2023 22వ మ్యాచ్ ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతోంది. ప్రపంచం మొత్తం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ఆ స‌మ‌యం రానే వ‌చ్చింది. క్రికెట్ గాడ్‌ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ తరఫున ఈ మ్యాచ్‌లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేయనున్నాడు. అంతర్జాతీయ వేదికపై సచిన్ కుమారుడి ప్రతిభను ఇప్పుడు ప్రపంచం మొత్తం చూడ‌నుంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అర్జున్ టెండూల్కర్ ముంబై క్యాప్ అందుకున్నాడు. 2021 మెగా వేలంలో రూ. 30 లక్షలకు ఫ్రాంచైజీ అతడిని కొనుగోలు చేసింది.

అర్జున్ టెండూల్కర్ మూడేళ్ల పాటు ముంబై ఇండియన్స్ క్యాంపులో పాల్గొన్నాడు. అర్జున్ పిలుపు కోసం బెంచ్ మీద ఎంతో కాలం వేచి ఉండవలసి వచ్చింది. గత సీజన్‌లో కూడా అతను అరంగేట్రం చేస్తాడని ఊహాగానాలు వచ్చాయి.. కానీ అతనికి అవకాశం రాలేదు. ఈ సీజన్‌ నాలుగో మ్యాచ్‌లో అర్జున్ ముంబై క్యాప్ అందుకున్నాడు. రోహిత్ శర్మ అతనికి క్యాప్ అందజేసి కౌగిలించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఆడడం లేదు. సూర్యకుమార్ యాదవ్ జట్టును నడిపిస్తున్నాడు. అలాగే మోచేయి గాయం కారణంగా జోఫ్రా ఆర్చర్ ఈ మ్యాచ్ ఆడడం లేదు.

అర్జున్ టెండూల్కర్ ఇప్పటి వరకు 7 లిస్ట్ A మ్యాచ్‌లు, 9 T20 మ్యాచ్‌లు ఆడాడు. అతను 4.98 ఎకానమీతో లిస్ట్ Aలో 8 వికెట్లు సాధించాడు. T20ల‌లో 12 వికెట్లు పడగొట్టాడు. అతను ఇప్పటివరకు వన్డేలు మరియు టీ20లు రెండింటిలోనూ పొదుపుగా నిరూపించుకున్నాడు. రంజీ ఫార్మాట్‌లో బ్యాట్‌తోనూ రాణించి ఆల్‌రౌండర్‌గా ఎదగగలనని నిరూపించాడు. ఒక సెంచరీతో సహా 223 పరుగులు చేశాడు. 120 అతని అత్యధిక స్కోరు.


Next Story