ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ 2022లో అర్జెంటీనా జట్టు అదరగొట్టింది. సెమీఫైనల్ మ్యాచ్‌లో క్రొయేషియాపై అద్భుత విజయాన్ని సాధించి ఫైనల్‌కు దూసుకువెళ్లింది. మంగళవారం అర్థరాత్రి 12.30 గంటలకు ప్రారంభమైన మ్యాచ్‌లో అర్జెంటీనా 3-0 తేడాతో క్రొయేషియాను మట్టికరిపించింది.
తొలి అర్థభాగంలో అర్జెంటీనా రెండు గోల్స్ చేసి మ్యాచ్‌పై ఆధిక్యం సంపాదించింది. 34వ నిమిషంలో కెప్టెన్ మెస్సీ పెనాల్టీ కిక్ ద్వారా గోల్ చేశాడు. 38వ నిమిషంలో అల్వారెజ్ మరో గోల్ చేయడంతో అర్జెంటీనా 2-0 ఆధిక్యంతో తొలి అర్థభాగాన్ని ముగించింది. ఇక రెండో అర్థభాగంలోనూ అర్జెంటీనా ఆటగాళ్లు క్రియేషియాకు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు.
క్రొయేషియా గోల్ పోస్ట్‌లపై దాడులు పెంచారు. ఫలితంగా అల్వారాజ్ 69వ నిమిషంలో మరో గోల్ చేసి అర్జెంటీనా ఆధిక్యాన్ని 3-0కు పెంచాడు. మ్యాచ్ ముగిసే సమయానికి కూడా క్రొయేషియా ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. దీంతో 3-0తో అర్జెంటీనా విజయం సాధించి 2014 తరువాత ఫైనల్‌లోకి అడుగుపెట్టింది.