ఆర్చరీ మహిళల వ్యక్తిగత విభాగంలో దీపికా కుమారి పతకం దిశగా మరో అడుగు ముందుకు వేసింది. శుక్రవారం ఉదయం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో రష్యా ఆర్చర్ కేనియా పెరోవాపై 6-5 తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ హోరా హోరీగా సాగింది. ఐదు సెట్లు ముగిసే సరికి దీపిక రెండు సెట్లను గెలవగా... పెరోవా రెండు సెట్లను గెలిచింది. మరొక సెట్ టై అయింది. దీంతో షూట్ ఆఫ్‌లో ఫలితం తేల్చాల్సి వచ్చింది. అయితే కీలకమైన షూట్ ఆఫ్‌లో దీపికా పర్ఫెక్ట్ 10 స్కోరు చేయగా.. ప్రత్యర్థి 7 మాత్రమే చేయగలిగింది. ఈ విజయంతో దీపికా క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టింది. ఉదయం 11.30 గంటలకు కొరియాకు చెందిన సాన్ ఆన్‌తో దీపికా క్వార్టర్స్‌లో తలపడనుంది.
నిరాశ పరిచిన మహిళా షూటర్లు..
భారత మహిళా షూటర్లకు నిరాశే ఎదురైంది. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో 290 పాయింట్లతో మనుబాకర్ 12వ స్థానంలో.. 286 పాయింట్లతో సర్నబోత్ రహీ 33వ స్థానంలో నిలిచింది. దీంతో వారిద్దరు ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించలేకపోయారు.