భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ దంపతులు ఇటీవలే తల్లిదండ్రులు అయ్యారు. తాము ఒకవేళ బయటకు వచ్చినా తామిద్దరి ఫోటోలను మాత్రమే తీయాలని.. తమ కుమార్తె ఫోటోను తీయకండని కోరారు. ఇక తల్లిదండ్రులు అయ్యాక ఒక్కసారి కూడా బయటకు రాని విరుష్క దంపతులు తొలిసారి బయటకు వచ్చారు. ఇద్దరూ నవ్వుతూ కనిపించారు. జంటగా కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.
విరాట్ కోహ్లి-అనుష్క శర్మ దంపతుల ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కూతురు పుట్టాక మొదటిసారిగా ఈ జంట బయట కాలు పెట్టడంతో మీడియా వారిని కెమెరాలలో బంధించింది. వీరితో వారి కూతురు లేకపోవడంతో మీడియా మిత్రులు కాస్త డల్ అయ్యారు. కొత్తగా తల్లిదండ్రులైన తర్వాత తొలిసారిగా విరాట్, అనుష్కలను చూసి వారి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.
అనుష్క పడ్డంటి ఆడబిడ్డకు జన్మినిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు వారి కూతురి ఫొటోను చూపించకుండా ఈ సెలబ్రిటీ కపుల్ గొప్యత పాటిస్తున్నారు. అంతేగాక వారి ప్రైవసీని డిస్టర్బ్ చేయోద్దంటూ వారు మీడియాను కోరిన విషయం తెలిసిందే. విరుష్క దంపతులు తమ కుమార్తె ఫోటోను అభిమానులతో ఎప్పుడు షేర్ చేసుకుంటారా అని కూడా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు.