బుమ్రా పెళ్లి.. హీరోయిన్‌తోనా..స్పోర్ట్స్ ప్రెజెంటర్‌తోనా..?
Anupama Parameswaran or Sanjana Ganesan Who is Jasprit Bumrah bride.బుమ్రాను వివాహమాడనున్న ఆ అమ్మాయి ఎవరా అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు
By తోట వంశీ కుమార్ Published on 6 March 2021 2:59 PM IST
ఇంగ్లాండ్‌తో జరిగే నాలుగో టెస్టుతో పాటు వన్డే, టీ20 సిరీస్ నుంచి వ్యక్తిగత కారణాలతో బుమ్రా సెలవు తీసుకున్నాడని బీసీసీఐ(భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు) ఓ ప్రకటనలో తెలిపిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి బుమ్రా ఎందుకు ఇన్ని రోజులు సెలవు తీసుకున్నాడనే దానిపై చర్చ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ ఆంగ్ల ప్రతిక బుమ్రా త్వరలో పెళ్లి చేసుకోనుకున్నాడని అందుకే సెలవు తీసుకున్నాడని వెల్లడించింది. ఈ విషయాన్ని ఓ బీసీసీఐ అధికారి కూడా చెప్పడంతో బుమ్రా పెళ్లిచేసుకోవడం కోసమే సెలవు తీసుకున్నాడని తెలిసింది.
ఇక మళ్లీ అప్పటి నుంచి బుమ్రాను వివాహమాడనున్న ఆ అమ్మాయి ఎవరా అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఓ క్యూట్ మలయాళ హీరోయిన్‌తో డీప్ ప్రేమలో పడ్డాడని.. అతడంటే ఆ క్యూటీ కూడా విపరీతంగా ఇష్టపడుతోందని ప్రచారం మొదలైంది. తొందర్లోనే ఈ జోడి పెళ్లికి సిద్ధమవుతున్నారని కాస్త అడ్వాన్స్ డ్ గానే కథనాలు వండి వార్చారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో ప్రత్యేకంగా చెప్పాలా? క్యూట్ అనుపమ పరమేశ్వరన్ గురించే ఇదంతా. బుమ్రా తన ఫేవరెట్ క్రికెటర్ అని గతంలో ప్రకటించింది అనుమప.
అయితే.. ఇప్పుడు బుమ్రా వేరొక భామను పెళ్లాడేయబోతున్నాడన్న పుకార్ వేడెక్కిస్తోంది. అతడు పెళ్లాడబోయేది అనుపమను కాదు.. 28 ఏళ్ల సంజనా గణేశన్ అనే ఓ స్పోర్ట్స్ ప్రెజెంటర్ ని అంటూ ప్రచారమవుతోంది. ఈ పేరు ఇంతకుముందే వినిపించినా ఇప్పుడు అనూహ్యంగా తెరపైకి రావడంతో అంతా ఖంగు తిన్నారు. మహారాష్ట్రకు చెందిన ఈ భామ ఎంటీవీ స్ప్లిట్స్‌విల్లా సీజన్ 7 తో కెరీర్ ఆరంభించింది. ఐపీఎల్ సహా పలు క్రీడా ఈవెంట్లకు ప్రెజెంటర్ వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే బుమ్రాతో ఏర్పడిన పరిచయం.. పరిణయానికి దారి తీసిందంటూ ప్రచారం జరుగుతోంది.
బుమ్రా వివాహం గోవాలో జరగనున్నట్లు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో అత్యంత సన్నిహితుల మధ్య డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబుతున్నాడని అంటున్నారు. అయితే.. ఇప్పటి వరుకు ఎవరు ఆ లక్కీ గర్ల్ అనేది తెలియడం లేదు. కాగా.. హాలిడే మూడ్‌లో ఉన్నానంటూ అనుపమ.. బుగ్గలకు పసుపు, కుంకుమ రాసుకున్న ఫొటో షేర్ చేయడంతో మెజారిటీ మంది అనుపమే ఆ లక్కీ గర్ల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరీ బుమ్రా పెళ్లిచేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగక తప్పదేమో