విరాట్‌ కోహ్లీ ఖాతాలో మరో రికార్డ్‌

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. భారత్‌ తరఫున టెస్టుల్లో అత్యధిక క్యాచులు అందుకున్న మూడో ప్లేయర్‌గా కోహ్లీ నిలిచారు.

By అంజి  Published on  15 Dec 2024 10:30 AM IST
Indian star cricketer, Virat Kohli, Australia, Test match

విరాట్‌ కోహ్లీ ఖాతాలో మరో రికార్డ్‌

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. భారత్‌ తరఫున టెస్టుల్లో అత్యధిక క్యాచులు అందుకున్న మూడో ప్లేయర్‌గా కోహ్లీ నిలిచారు. ఇప్పటి వరకు ఆయన 117 క్యాచులు అందుకున్నారు. ఈ క్రమంలోనే సచిన్‌ (115) రికార్డును ఆయన అధిగమించారు. అగ్ర స్థానంలో రాహుల్‌ ద్రవిడ్‌ (210) ఉన్నారు. ఆ తర్వాత వీవీఎస్‌ లక్ష్మణ్‌ (135) కొనసాగుతున్నారు. కాగా మూడో టెస్టులో విరాట్‌ 2 క్యాచులు అందుకున్నారు.

అటు క్రికెట్‌ చరిత్రలో ఆస్ట్రేలియాపై అత్యధిక మ్యాచులు ఆడిన రికార్డు భారత లెజెండరీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉంది. అన్ని ఫార్మాట్లలో కలిపి ఆయన మొత్తం 110 మ్యాచులు ఆడారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా విరాట్‌ కోహ్లీ (100), వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌ డెస్మండ్‌ హేన్స్‌ (97), ఎంఎస్‌ ధోనీ (91), వివ్‌ రిచర్డ్స్‌ (88) ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌ కోహ్లీకి 100వ మ్యాచ్‌ కావడం గమనార్హం.

Next Story