అర్జున్ టెండూల్కర్‌ను వదులుకోనున్న ముంబై ఇండియన్స్.?

చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య సంజు సాంస‌న్, రవీంద్ర జడేజా ట్రేడ్ నడుస్తోంది.

By -  Medi Samrat
Published on : 12 Nov 2025 8:30 PM IST

అర్జున్ టెండూల్కర్‌ను వదులుకోనున్న ముంబై ఇండియన్స్.?

చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య సంజు సాంస‌న్, రవీంద్ర జడేజా ట్రేడ్ నడుస్తోంది. అయితే లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య శార్దూల్ ఠాకూర్, అర్జున్ టెండూల్కర్ మార్పిడి గురించి చర్చ జరుగుతోందని క్రిక్‌బజ్ నివేదించింది.

ఠాకూర్, టెండూల్కర్ ఇద్దరూ ఫ్రాంచైజీలను మార్చుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్రేడ్ నిబంధనల ప్రకారం.. ఏదైనా మార్పిడిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుందని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) గతంలో తెలిపింది. అయితే, ఆటగాళ్ల మార్పిడి సాధ్యమేనని ముంబై క్రికెట్ వర్గాల వర్గాలు క్రిక్‌బజ్‌కు ధృవీకరించాయి. త్వరలోనే ఈ ట్రేడ్ కు సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

అర్జున్ టెండూల్కర్ రెండు సీజన్లలో ముంబై ఇండియన్స్ జట్టులో భాగమయ్యాడు. అతను నమోదు చేసుకున్న రెండు సీజన్ల వేలంలోనూ అతని ప్రాథమిక ధర 20 లక్షలకు ఎంపికయ్యాడు. 26 ఏళ్ల ఈ ఎడమచేతి వాటం ఆల్ రౌండర్ గత సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ గత రెండు సీజన్లలో అతడు నాలుగు మ్యాచ్‌లు ఆడాడు. 2023లో మూడు, 2024లో ఒకటి ఆడాడు. మొత్తం మీద, ఇప్పటి వరకూ అర్జున్ ఐదు IPL మ్యాచ్‌లలో ఆడాడు, 13 పరుగులు చేశాడు. మూడు వికెట్లు తీసుకున్నాడు.

Next Story