FactCheck : ఆసియా కప్ లో ఇండియా-శ్రీలంక మ్యాచ్ గురించి ఆండ్రూ సైమండ్స్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.. సైమండ్స్ చనిపోయి సంవత్సరం దాటింది.

ఆసియా కప్- 2023 ఫైనల్ లో భారత్ చేతిలో శ్రీలంక ఓడిపోయిన సంగతి తెలిసిందే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Sep 2023 3:33 PM GMT
FactCheck : ఆసియా కప్ లో ఇండియా-శ్రీలంక మ్యాచ్ గురించి ఆండ్రూ సైమండ్స్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.. సైమండ్స్ చనిపోయి సంవత్సరం దాటింది.

ఆసియా కప్- 2023 ఫైనల్ లో భారత్ చేతిలో శ్రీలంక ఓడిపోయిన సంగతి తెలిసిందే..! భారత్ విజయంపై పలువురు పలు రకాలుగా స్పందిస్తూ ఉన్నారు. శ్రీలంక కావాలనే ఓడిపోయినట్లుగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ చెప్పారని ఓ స్టేట్మెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

“The way SL turned up today it seems like some sort of arrangement was already made behind the scenes, to see a team that has reached the finals play in this manner raises quite a few questions but maybe we should keep quiet and not upset the ACC & BCCI.” అంటూ సైమండ్స్ కు ఆపాదించి కొన్ని స్టేట్మెంట్స్ ను షేర్ చేస్తున్నారు.

ఫైనల్ కు చేరిన శ్రీలంక అంచనాలకు తగ్గట్టుగా ఆడలేదని.. ఓడిపోయిన తీరు కారణంగా చాలా అనుమానాలు కలుగుతున్నాయని సైమండ్స్ చెప్పారని పోస్టులు పెట్టారు.

రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు శ్రీలంకను 50 పరుగులకు కట్టడి చేసి, 263 బంతులు మిగిలి ఉండగానే 10 వికెట్ల తేడాతో విజయం సాధించి ఆసియా కప్ 2023 ట్రోఫీని అందుకుంది. ఆ తర్వాత ఇలాంటి పోస్టులు వైరల్ అయ్యాయి.

నిజ నిర్ధారణ :

NewsMeter బృందం వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదని గుర్తించింది.

ఆండ్రూ సైమండ్స్ చనిపోయాడు. సైమండ్స్ 2022లో కారు ప్రమాదంలో మరణించారు. ఈ విషయం క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

మేము సంబంధిత కీవర్డ్ సెర్చ్ ను అమలు చేసాము. కానీ రిజల్ట్స్ కు సంబంధించి ఎటువంటి నివేదికను దొరకలేదు. మేము 2022లో ఆండ్రూ సైమండ్స్ అతని స్వస్థలమైన క్వీన్స్‌లాండ్‌లోని టౌన్స్‌విల్లే దగ్గర కారు ప్రమాదంలో మరణించినట్లు ఎన్నో నివేదికలు దొరికాయి.

మే 15, 2022న అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) అధికారిక X హ్యాండిల్ లో కూడా 46 సంవత్సరాల వయస్సులో ఆస్ట్రేలియా లెజెండ్ ఆండ్రూ సైమండ్స్ చనిపోయాడంటూ ప్రకటించిన పోస్టును మేము చూశాం. సైమండ్స్ మే 14న చనిపోయాడని ఆస్ట్రేలియా మీడియా తెలిపింది.

2003 ప్రపంచ కప్ సమయంలో సైమండ్స్ మంచి ప్రదర్శన చేశాడు.అతను 198 ODIలు ఆడాడు, ఆరు సెంచరీలు, 30 అర్ధ సెంచరీలు చేశాడు. అతను బౌలర్ గా కూడా రాణించాడు. 133 వికెట్లు కూడా పడగొట్టాడు.

కాబట్టి, ఆండ్రూ సైమండ్స్‌ శ్రీలంక ఓటమి గురించి అనుమానాలు వ్యక్తం చేశాడనే ప్రకటనలో ఎటువంటి నిజం లేదని మేము నిర్ధారించాము.

Credits : Md Mahfooz Alam

Claim Review:ఆసియా కప్ లో ఇండియా-శ్రీలంక మ్యాచ్ గురించి ఆండ్రూ సైమండ్స్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.. సైమండ్స్ చనిపోయి సంవత్సరం దాటింది.
Claimed By:Facebook Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Facebook
Claim Fact Check:False
Next Story