ధోనీ అంటే ఫ్యాన్స్‌కు ఎంత పిచ్చో ఆండ్రీ రస్సెల్‌కు అర్ధ‌మైంది..!

ఐపీఎల్ 2024లో ఎంఎస్ ధోనీ ఆడుతున్న విష‌యం తెలిసిందే. రిటైర‌వుతాడ‌నుకున్న ధోనీ ఈ సీజన్‌లో మైదానంలోకి అడుగుపెడుతుంటే అభిమానులకు పండగ‌లా అనిపిస్తోంది

By Medi Samrat  Published on  9 April 2024 6:00 PM IST
ధోనీ అంటే ఫ్యాన్స్‌కు ఎంత పిచ్చో ఆండ్రీ రస్సెల్‌కు అర్ధ‌మైంది..!

ఐపీఎల్ 2024లో ఎంఎస్ ధోనీ ఆడుతున్న విష‌యం తెలిసిందే. రిటైర‌వుతాడ‌నుకున్న ధోనీ ఈ సీజన్‌లో మైదానంలోకి అడుగుపెడుతుంటే అభిమానులకు పండగ‌లా అనిపిస్తోంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఆడుతున్న‌ప్పుడు కూడా ధోనీ ఫ్యాన్స్ అంతే అభిమానాన్ని చూపించారు. చెపాక్‌ మైదానంలో బ్యాట్‌ పట్టుకుని ధోనీ గ్రౌండ్‌లోకి వ‌చ్చిన‌ వెంటనే భారీ శబ్దం వచ్చింది. దీంతో కేకేఆర్ స్టార్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ కూడా అభిమానుల్లో మహికి ఇంత క్రేజ్ రావడం చూసి ఆశ్చర్యపోయాడు.

నిజానికి MS ధోని KKRపై బ్యాటింగ్‌కు వ‌చ్చిన‌ప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి 3 పరుగులు కావాలి. డ్రెస్సింగ్ రూమ్ నుంచి ధోనీ బయటకు రాగానే చెపాక్ మైదానంలో భారీ సందడి నెలకొంది. మైదానంలో ధోనీ-ధోనీ నినాదాలు మొదలయ్యాయి. బౌండరీ లైన్‌పై నిలబడిన ఆండ్రీ రస్సెల్ తన రెండు చెవులపై చేతులు వేసుకోవాల్సినంతగా అభిమానుల సందడి నెలకొంది.

ఎంఎస్ ధోనీకి ఇలాంటి పిచ్చి ఫ్యాన్స్ ఉండ‌టం చూసి రస్సెల్ ఆశ్చర్యపోయాడు. రస్సెల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో మహిని ప్రశంసించాడు. ధోనీతో ఉన్న‌ తన చిత్రాన్ని పంచుకుంటూ. "ఈ వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత ఇష్టపడే క్రికెటర్ అని నేను అనుకుంటున్నానని రాసుకొచ్చాడు.

చెపాక్‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ ఏకపక్షంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. CSK తరపున కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 67 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. రుతురాజ్‌తో పాటు శివమ్ దూబే కూడా 18 బంతుల్లో 28 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో చెన్నై తరఫున రవీంద్ర జడేజా, తుషార్ దేశ్‌పాండే చెరో మూడు వికెట్లు తీశారు.


Next Story