టిమ్ పైన్ స్థానంలో అలెక్స్ క్యారీ.. జాక్‌పాట్ కొట్టాడు
Alex Carey Replaces Tim Paine As Australian Wicketkeeper For Ashes.ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య డిసెంబర్
By తోట వంశీ కుమార్ Published on 2 Dec 2021 7:03 AM GMTఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య డిసెంబర్ 8 నుంచి ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా వికెట్ కీపర్ టిమ్‌పైన్ అసభ్యకర సందేశాలు పంపిన వివాదంలో చిక్కుకుని తన కెప్టెన్సీకి రాజీనామా చేయడంతో పాటు ఆటకు కొద్ది రోజులు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించాడు. ఈనేపథ్యంలోనే ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్‌గా ప్యాట్ కమిన్స్ నునియమించగా.. వైస్ కెప్టెన్‌గా స్టీవ్‌స్మిత్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో వికెట్ కీపింగ్ ఎవరు చేస్తారు అన్నదానిపై ఇంత వరకు స్పష్టత లేదు. తాజాగా నేడు(గురువారం) క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) దీనిపై స్పందించింది. టిమ్‌పైన్ స్థానంలో అలెక్స్ క్యారీ బాధ్యతలు నిర్వర్తిస్తాడని వెల్లడించింది.
ఇప్పటి వరకు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించిన అలెక్స్ క్యారీ.. యాషెస్ సిరీస్ తొలి టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్‌లో అరంగ్రేటం చేయనున్నాడు. ఇప్పటి వరకు 45 వన్డేల్లో 1203 పరుగులు, 38 టి20ల్లో 233 పరుగులు సాధించాడు. ఇదే విషయమై సెలక్టర్స్ చైర్మన్ జార్జ్ బెయిలీ మాట్లాడుతూ.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అలెక్స్ క్యారీ రెగ్యులర్ సభ్యుడిగా ఉన్నాడని.. అతడి దూకుడైన ఆట ఇప్పుకు జట్టుకు చాలా అవసరం అని టెస్టు క్రికెట్‌లో కూడా అతడు సత్తా చాటుతాడు అనే నమ్మకం ఉందన్నాడు. ఇక టెస్టులో అరంగ్రేటం చేయనుండడం పట్ల అలెక్స్ క్యారీ స్పందించాడు. యాషెస్ సిరీస్ లాంటి గొప్ప పోరులో భాగస్వామి కావడం సంతోషంగా ఉందన్నాడు.
ఇక యాషెస్ సిరీస్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా మొదటి రెండు టెస్టుల్లో పాల్గొనే 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది.
ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్(వైస్ కెప్టెన్), మార్నస్ లాబుస్, అలెక్స్ కారీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, కెమెరూన్ గ్రీన్, మార్కస్ హారిస్, ఉస్మాన్ ఖవాజా, నాథన్ లియోన్, మైఖేల్ నేజర్, ఝై రిచర్డ్‌సన్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్, మిచెల్ వార్నర్