ఆర్‌సీబీకి షాక్‌.. సుంద‌ర్ ఔట్‌

Akash Deep replaces injured Washington in RCB.కోహ్లీ సార‌థ్యంలోని రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు షాక్ త‌గిలింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Aug 2021 12:29 PM IST
ఆర్‌సీబీకి షాక్‌.. సుంద‌ర్ ఔట్‌

కోహ్లీ సార‌థ్యంలోని రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు కీల‌క ఆట‌గాడు ఆల్‌రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్ ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) రెండో ద‌శ‌కు దూరం అయ్యాడు. ఈ విష‌యాన్ని రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ జ‌ట్టు ధ్రువీక‌రించింది. అత‌డి స్థానంలో ఆకాశ్‌దీప్ అనే బౌల‌ర్‌ను తీసుకుంది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది. బెంగాల్ క్రికెట‌ర్ అయిన‌ ఆకాశ్‌దీప్ ప్ర‌స్తుతం ఆర్‌సీబీ నెట్‌బౌల‌ర్‌గా ఉన్నాడు. ఆకాశ్ దీప్.. రైట్ హ్యాండ్ మీడియం పేస్‌తో పాటు బ్యాటింగ్ కూడా చేయ‌గ‌ల‌డు.

కాగా.. సుంద‌ర్ లేక‌పోవ‌డం జ‌ట్టుకు ఎదురుదెబ్బ‌గానే చెప్ప‌వ‌చ్చు. అటు బౌల‌ర్‌గా.. ఇటు బ్యాట్స్‌మెన్‌గా సుంద‌ర్ అద‌ర‌గొట్టాడు. ప‌వ‌ర్ ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేస్తూ.. ఓపెన‌ర్‌, మిడిల్ ఆర్డ‌ర్‌, లోయ‌ర్ ఆర్డ‌ర్‌లోనూ బ్యాటింగ్ చేస్తూ ఆర్‌సీబీ విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషించాడు.

క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డిన ఐపీఎల్ 2021 సీజ‌న్ మిగిలిన మ్యాచ్‌లు సెప్టెంబ‌ర్ 19 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్ప‌టికే కొన్ని ఫ్రాంచైజీలు దుబాయ్ చేరుకున్నాయి. అక్క‌డి వాతావర‌ణానికి అల‌వాటు ప‌డుతూ సాధ‌న కూడా మొద‌లెట్టాయి. కాగా.. బెంగ‌ళూరు ఇంకా అక్క‌డికి వెళ్ల‌లేదు. మ‌రో రెండు రోజుల్లో బెంగ‌ళూరు జ‌ట్టు అక్క‌డికి వెళ్లే అవ‌కాశం ఉంది. ఇక జ‌ట్టు కెప్టెన్ కోహ్లీ ప్ర‌స్తుతం ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆడుతున్నాడు. సిరీస్ ముగిసిన అనంత‌రం నేరుగా యూఏఈ వెళ్ల‌నున్నాడు. ఈ సీజ‌న్ లో 7 మ్యాచ్‌లు ఆడిని బెంగ‌ళూరు 5 విజ‌యాలు సాధించి 10 పాయింట్ల‌తో మూడో స్థానంలో ఉంది.

Next Story