10 వికెట్ల వీరుడు అజాజ్ పటేల్‌కు షాకిచ్చిన కివీస్‌

Ajaz Patel Dropped For Bangladesh Test Series.ఇటీవ‌ల ముంబైలో ఇండియాతో జ‌రిగిన టెస్టు మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Dec 2021 9:11 AM GMT
10 వికెట్ల వీరుడు అజాజ్ పటేల్‌కు షాకిచ్చిన కివీస్‌

ఇటీవ‌ల ముంబైలో ఇండియాతో జ‌రిగిన టెస్టు మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో ప‌ది వికెట్లు తీసి అరుదైన రికార్డు నెల‌కొల్పాడు న్యూజిలాండ్ స్పిన్న‌ర్ అజాజ్ ప‌టేల్‌. ఇంగ్లాండ్ బౌలర్ జిమ్‌లేక‌ర్‌, భార‌త స్పిన్న‌ర్ అనిల్ కుంబ్లే త‌రువాత ఆ ఘ‌న‌త సాధించిన బౌల‌ర్‌గా నిలిచాడు. అంత‌టి గొప్ప ప్ర‌ద‌ర్శ‌న చేసిన ప‌టేల్‌కు కివీస్ క్రికెట్ బోర్డు షాక్ ఇచ్చింది. బంగ్లాదేశ్ తో జ‌రిగే టెస్టు సిరీస్‌కు అత‌డిని ఎంపిక చేయ‌లేదు.

స్వ‌దేశంలో న్యూజిలాండ్ జ‌ట్టు బంగ్లాదేశ్ తో రెండు టెస్టుల మ్యాచ్ ల సిరీస్ ఆడ‌నుంది. జ‌న‌వ‌రి 1 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుండ‌గా.. 13 మందితో కూడిన కివీస్ జ‌ట్టును ప్ర‌క‌టించారు సెల‌క్ట‌ర్లు. ఇందులో ఏకైక స్పిన్న‌ర్‌గా ర‌చిన్ ర‌వీంద్ర‌ను తీసుకున్నారు. ఆల్‌రౌండర్ కోటాలో అత‌ను స్థానం ద‌క్కించుకున్నాడు. 'ఇది బాధ కలిగించేదే అయినా స్వదేశంలో జరిగే సిరీస్‌లో తమ జట్టులో స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌కు చోటు లేదని.. ఘనతలను బట్టి కాకుండా టీమ్‌ అవసరాలను బట్టే ఆటగాళ్లను ఎంపిక చేస్తామని' కివీస్‌ సెలక్టర్లు ప్రకటించారు. ఈ సిరీస్‌కు కూడా టామ్‌ లాథ‌మ్ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. రెగ్యుల‌ర్ కెప్టెన్ కేన్ విలియ‌మ్ స‌న్ గాయం కార‌ణంతో దూరం అయ్యాడు.

న్యూజిలాండ్‌ జట్టు : టామ్ లాథమ్ (కెప్టెన్‌), రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్, రచిన్ రవీంద్ర, కైల్ జేమీసన్, టిమ్ సౌతీ, మాట్ హెన్రీ, డెవాన్ కాన్వే, నీల్ వాగ్నర్, ట్రెంట్ బౌల్ట్

Next Story
Share it