ఐపీఎల్ లో నేడు శనివారం డబుల్ హెడర్ లో భాగంగా తొలి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్ మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో కెప్టెన్ ఇషాన్ కిషన్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మొదట బ్యాటింగ్ కు దిగింది. అయితే అభిషేక్ శర్మ దంచేశాడు. నాలుగు ఓవర్లకు సన్ రైజర్స్ స్కోరు ఏకంగా 60 పరుగులు చేరింది. నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి సన్ రైజర్స్ ఎంత స్కోరు చేస్తుందో చూడాలి.
సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (కెప్టెన్/వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, శివాంగ్ కుమార్, హర్షల్ పటేల్, ఇషాన్ మలింగ.
పంజాబ్ కింగ్స్: ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), కూపర్ కానలీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, విజయ్‌కుమార్ వైశాఖ్, అర్ష్‌దీప్ సింగ్, యజువేంద్ర చాహల్.