14 ఏళ్ల వయసులో శనివారం ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ.. శార్దూల్ ఠాకూర్ వేసిన తొలి బంతికే సిక్సర్ కొట్టి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఆ ప్రతిభ వెనుక ఎంతో శ్రమ ఉంది. అతని తండ్రి సంజీవ్ సూర్యవంశీ తన కొడుకు క్రికెట్ కలను నెరవేర్చడానికి తన వ్యవసాయ భూమిని విక్రయించి ఈ అద్భుతమైన కథకు పునాది వేశాడు. పాట్నా క్రికెట్ కోచ్ మనీష్ ఓజా వైభవ్ ప్రతిభను గుర్తించి.. 10 ఏళ్ల వయసులోనే వైభవ్‌ను రోజూ 600 బంతులు ఎదుర్కొనేలా ప్రాక్టీసు చేయించేవాడు.
అతని షాట్‌లోని శక్తిని మీరు చూశారు.. బ్యాట్ యొక్క స్వింగ్, సరైన టైమింగ్ ఉంటుంది. సిక్సర్ కొట్టడానికి బలం ఒక్కటే ప్రమాణం అయితే.. రెజ్లర్లు క్రికెట్ ఆడేవారు. ఇది ఐదు సంవత్సరాల శిక్షణ.. ప్రతిరోజూ 600 వందల బంతులు ఆడేవాడని కోచ్ చెప్పాడు. అకాడమీల్లోని ఇతర అబ్బాయిలు బహుశా రోజుకు 50 బంతులు ఆడతారని అతను చెప్పాడు. నేను యూట్యూబ్‌లో వైభవ్ సూర్యవంశీ శిక్షణా సెషన్‌ల గురించి 40 వీడియోలను అప్‌లోడ్ చేసాను. అతని బ్యాట్ స్వింగ్ యువరాజ్ సింగ్ లాగా ఉందని పేర్కొన్నాడు.
వైభవ్ తల్లిదండ్రులు అద్భుతమని.. అతని తండ్రి మ్యాచ్‌లకు హాజరయ్యేందుకు ప్రతిరోజూ 100 కిలోమీటర్లు ప్రయాణించేవారు. అతని ఆహారపు అలవాట్ల గురించి తల్లి చాలా స్పృహతో ఉండేది. ఒక వ్యక్తి రోజుకు 600 బంతులు ఆడితే, అతనికి ప్రోటీన్ పరంగా ఎక్కువ పోషకాహారం అవసరం అని పేర్కొన్నాడు.