టాలీవుడ్ డార్లింగ్ 'ప్ర‌భాస్' స్పెష‌ల్ స్టోరీ : పార్ట్ - 1

By Medi Samrat  Published on  21 Oct 2019 10:35 AM GMT
టాలీవుడ్ డార్లింగ్ ప్ర‌భాస్ స్పెష‌ల్ స్టోరీ : పార్ట్ - 1

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌....ఆరడుగుల హైట్‌, హైట్‌కు తగ్గ పర్సనాలిటీ, పర్సనాలిటీకి తగ్గ వాయిస్‌, అందరినీ ప్రేమగా డార్లింగ్‌ అని పిలుస్తూ, అందరికీ దగ్గరైన టాలీవుడ్‌ డార్లింగ్‌. రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు నటవారసుడుగా 'ఈశ్వర్‌' చిత్రంతో హీరోగా పరిచయమై అనతికాలంలోనే తన నటనతో అందరి మన్ననలు పొందారు. 'రాఘవేంద్ర', 'వర్షం', 'అడవిరాముడు', 'చక్రం', 'ఛత్రపతి', 'పౌర్ణమి', 'యోగి', 'మున్నా' 'బుజ్జిగాడు' 'బిల్లా', 'ఏక్‌నిరంజన్‌', 'డార్లింగ్‌', 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌', 'రెబల్‌', 'మిర్చి' వంటి విభిన్నమైన చిత్రాలు చేసి అన్నీ వర్గాల ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌. అయితే 'బాహుబలి ది బిగినింగ్‌', 'బాహుబలి 2'తో తిరుగులేని క్రేజ్‌ను తన సొంతం చేసుకున్నారు. ఈ రెండు పార్టుల కోసం ప్రభాస్‌ పడ్డ కష్టం మాటల్లో చెప్పలేనిది. అనుకున్న లక్ష్యాన్ని రీచ్‌ అవడానికి వేసిన ప్రతి అడుగులో కృషి, పట్టుదల, దీక్ష.. ప్రభాస్‌ని కోట్లాది మందికి చేరువ చేశాయి.

Related image

బాహువుల్లో అమితమైన బలవంతుడు, గొప్ప పరాక్రమవంతుడు అమరేంద్ర బాహుబలి. ఇలాంటి ఓ నాయకుడిని తెర పై ఆవిష్కరించాలంటే తేలికైన విషయం కాదని రాజమౌళికి తెలుసు. కథను సిద్ధం చేసుకోగానే ప్రభాస్‌ను కలిసి కథ చెప్పాడు. అంతా ఓకే అయ్యింది. రెండేళ్లలో బాహుబలి ప్రాజెక్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అనుకున్నారు. అయితే రేండేళ్లు కాస్తా ఐదేళ్లయ్యింది. ఐదేళ్ల వరకు మరో ప్రాజెక్ట్‌ గురించి ఆలోచించకుండా ఓ కమిట్‌మెంట్‌తో సినిమా చేయడమంటే మరో హీరో ఎవరైనా ఎందుకా అని ఆలోచించేవారు. కానీ ప్రభాస్‌ మాత్రం ఆలోచించలేదు.

Related image

ఐదేళ్లు బాహుబలి గురించే తపన పడ్డారు. మరో సినిమా చేయడానికి కూడా ఇష్టపడలేదు. ఆయన తపన, రాజమౌళి కృషి కలయికే బాహుబలి. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి తెలియజేయడమే కాదు, ఏకంగా తెలుగు సినిమా మార్కెట్‌ను ఆకాశమే హద్దు అనేలా చేసింది. ప్రభాస్‌ అభిమానులు, ప్రేక్షకులు అమరేంద్ర బాహులి, మహేంద్ర బాహుబలి స్థానంలో ఇంకెవర్నీ ఊహించలేంటూ ముక్త కంఠంతో కలెక్షన్స్‌ రూపంలో బదులిచ్చారు...అది కూడా రికార్డుల రూపంలో బాహుబలి రెండు భాగాలు కలిపి దాదాపు రెండున్నర వేల కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టిందంటే ఆ సినిమా ప్రభావం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించనక్కర్లేదు.

Related image

బాహుబలి రిలీజ్‌ ముందు వరకు తెలుగు సినిమా మార్కెట్‌ ఓ వందకోట్లు ఉంటే.. రిలీజ్‌ తర్వాత ఆ రేంజ్‌ పాతిక రెట్లు పెరిగింది. దక్షిణాది సినిమా అంటే చిన్నచూపు చూసే ఉత్తరాదివారిని నోర్లు వెళ్లబెట్టేంత కలెక్షన్స్‌ కుంభవృష్టిని కురిపించింది. సినిమా విడుదలైన ప్రతిచోట కళ్లు తిరిగే వసూళ్లును రాబట్టుకుంది. బాహుబలి 2 తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో ఒక్కొక్క దగ్గర వంద కోట్లకు పైగా రాబట్టిన ఈ చిత్రం దక్షిణాదిన మాత్రమే దాదాపు 700 కోట్ల రూపాయలను వసూలు చేసింది. అలాగే ఉత్తరాదిన 520 కోట్ల రూపాయలను కలెక్ట్‌ చేసింది. మిగిలిన దేశాల్లో ఎంత క‌లెక్ట్ చేసిందంటే... (ఇంకా ఉంది..)

Next Story