సినిమాల్లో త‌క్కువ‌గా యాక్ట్ చేయ‌డం.. రీరికార్డింగ్ హేవీగా లేకుండా… కొత్త‌గా చూపించ‌డం అనేది శివ సినిమాతోనే స్టార్ట్ అయ్యింది. త‌క్కువుగా యాక్ట్ చేయ‌డం.. రీ రికార్డింగ్ హేవీగా లేకుండా చేయ‌డం వ‌ల‌న క్రియేటివ్ ఇంపాక్ట్ ఎక్కువుగా ఉంటుంది. రాము గారి స్టాండ‌ర్డ్ అది. శివ సినిమా వ‌చ్చి చాలా మార్పులు తీసుకువ‌చ్చింది. అందులో అది మంచి అవ‌చ్చు చెడు అవ‌చ్చు.

Image result for shiva movie poster

శివ వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌తి ఒక్క‌రు అడ్డ‌మైన సినిమాల‌కి సౌండ్ లు పెట్టి వాయించేయ‌డం మొద‌లుపెట్టారు. బ‌ట్ సౌండ్ అనేది ఒక‌టి ఉంది అని అర్ధం చేసుకున్నారు. ఫ‌ర్ ఫార్మెన్స్ లాగే, లైట్స్ లాగే, కాస్టూమ్స్ లాగే, సెట్స్ లాగే.. అది కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్త‌ది అని అప్పుడే తెలిసింది. ఆవిధంగా సౌండ్ అనేది ఆడియ‌న్స్ మీద చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్త‌ది అని చెప్పిన సినిమా శివ‌.

ఆత‌ర్వాత అంద‌రూ అది ఫాలో అయ్యారు. క‌మ‌ర్షియ‌ల్ సినిమా, చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా అంద‌రూ ఫాలో అయ్యారు. మ‌న‌కి సినిమా తీయాల‌నే పేష‌న్ ఉంటే చాలు మ‌నం సినిమా డైరెక్ట‌ర్ అవ్వ‌చ్చు అనే కాన్ఫిడెన్స్ కొన్ని వేల మంది అసిస్టెంట్ డైరెక్ట‌ర్స్ కి క‌ల్పించింది శివ‌.

Image result for yamadonga movie poster

య‌మ‌దొంగ‌, మ‌గ‌ధీర‌, మ‌ర్యాద రామ‌న్న‌, ఈగ‌… ఇలా త‌ను తెర‌కెక్కించే ప్ర‌తి సినిమాలో వైవిధ్యం చూపించి.. ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుని తిరులేని విజ‌యాల్ని అందుకున్నారు. ఆత‌ర్వాత రాజ‌మౌళి తెర‌కెక్కించిన సంచ‌ల‌న చిత్రం బాహుబలి. ప్ర‌భాస్, అనుష్క‌, రానా, ర‌మ్య‌కృష్ణ‌… ఇలా భారీ తారాగ‌ణంతో రూపొందిన బాహుబ‌లి సినిమా తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో రిలీజై సంచ‌ల‌న విజ‌యం సాధించి తెలుగు సినిమా స‌త్తాను మ‌రోసారి ప్ర‌పంచానికి చాటి చెప్పింది. ఇంకా చెప్పాలంటే… బాహుబ‌లి తెలుగు సినిమానా..? లేక హాలీవుడ్ మూవీనా..? అనేంత‌గా విజువ‌ల్ వండ‌ర్ లా రాజ‌మౌళి బాహుబ‌లి సినిమాని తెర‌కెక్కించారు.

బాహుబ‌లి చ‌రిత్ర సృష్టించ‌డంతో బాహుబ‌లి 2 ఎలా ఉండ‌బోతుంది అనే ఆస‌క్తితో బాహుబ‌లి 2 కోసం ఎదురు చూసేలా బాహుబ‌లి ఎండింగ్ ప్లాన్ చేయ‌డం రాజ‌మౌళి ప్ర‌తిభ‌కు నిద‌ర్శ‌నం. క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడు..? ప‌ండితుల నుంచి పామ‌రుల వ‌ర‌కు ఎవ‌రి నోట విన్నా ఇదే మాట‌. దీనిని బ‌ట్టి అర్ధం చేసుకోవ‌చ్చు రాజ‌మౌళి విజ‌న్ ఎలా ఉంటుందో.? బాహుబ‌లి 2 సినిమా 1000 కోట్లు క‌లెక్ట్ చేసి.. చ‌రిత్ర సృష్టించింది. 1000 కోట్లు క‌లెక్ట్ చేసిన మొట్ట మొద‌టి భారతీయ సినిమాగా బాహుబ‌లి 2 రికార్డ్ క్రియేట్ చేసింది.

Image result for bahubali1, bahubali2 movie poster

తెలుగోడు రూపొందించిన సినిమా కోసం దేశం మొత్తమే కాకుండా విదేశాల్లో సైతం ఎదురు చూడ‌డం అనేది బ‌హుశా ఇదే తొలిసారి కావ‌చ్చు. రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి సినిమా ఎంతో మంది ద‌ర్శ‌క‌నిర్మాత‌ల్లో కొత్త ఉత్సాహాన్ని అందించింది. పెద్ద బ‌డ్జెట్ తో సినిమా తీస్తే.. ఆ సినిమాని ఎలా మార్కెట్ చేసుకోవ‌చ్చు అనేది తెలియ‌చేసింది. బాహుబ‌లి ఇచ్చిన ధైర్యంతోనే సైరా న‌ర‌సింహారెడ్డి సినిమాని తీసామ‌ని స్వ‌యంగా మెగాస్టార్ చిరంజీవే ఎన్నో సార్లు చెప్పారు.

బాహుబ‌లి, బాహుబ‌లి 2 చిత్రాలు చ‌రిత్ర సృష్టించ‌డంతో ఈ ద‌ర్శ‌క‌ధీరుడు త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో ఉంటుంది..? ఏ త‌ర‌హా సినిమా చేస్తాడు..? అని ఎంతో ఆస‌క్తితో టాలీవుడ్ వారే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ కూడా ఎదురు చూసారంటే.. రాజ‌మౌళి ఎంత ప్ర‌భావం చూపింసాడో అర్ధం చేసుకోవ‌చ్చు. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ల క్రేజీ కాంబినేష‌న్ లో ఆర్ఆర్ఆర్ సినిమా అని రాజ‌మౌళి ఎనౌన్స్ చేయ‌గానే.. ఎప్పుడెప్పుడు ఈ సినిమా వ‌స్తుందా అని ప్రేక్ష‌క‌లోకం ఎదురు చూస్తుంది. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమా వ‌చ్చే సంవ‌త్స‌రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ద‌ర్శ‌క‌థీరుడు రాజ‌మౌళి మ‌న ఇండ‌స్ట్రీలో ఉండ‌డం తెలుగువారి అదృష్టం. మ‌రి.. ఈ జ‌క్క‌న్న మ‌రిన్ని సంచ‌ల‌న చిత్రాలు అందిస్తాడ‌ని.. తెలుగు వారి స‌త్తాను మ‌రోసారి ప్ర‌పంచానికి చాటి చెబుతాడ‌ని ఆశిస్తూ.. ఆల్ ది బెస్ట్ టు రాజ‌మౌళి..!

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.