సినిమాల్లో ఫైటులు న‌చ్చేవి కావు. శివ వ‌చ్చి 12 ఏళ్లు అయ్యింది ఇంకా మ‌నం ఫైట్స్ మామూలుగా తీస్తే అర్ధం లేదు. శివ ఫైట్స్  క్రియేట్ చేసిన ఇంపాక్ట్ నేను కూడా క్రియేట్ చేయ‌గ‌ల‌ని నా ఫీలింగ్. అందుచేత స్టూడెంట్ నెం 1 సినిమాకి ఫైట్స్ నేనే డిజైన్ చేసుకుంటాను అంటే… రాఘ‌వేంద్ర‌రావు గారికి ఫైట్స్ అంటే పెద్ద‌గా ఇంట్ర‌స్ట్ లేదు కాబ‌ట్టి ఓకే అనేసారు. అయితే.. స్టూడెంట్ నెం 1 సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ సాయిబాబా గారు.

ఆయ‌న రియాక్ష‌న్ ఏంటంటే.. రాజ‌మౌళికి ఫ‌స్ట్ టైమ్ డైరెక్ష‌నే ఇస్తున్నాం. ఫైట్స్ కూడా అత‌నే చేసుకుంటే ఎలాగా..?  ఎవ‌రొక‌రు ఫైట్ మాస్ట‌ర్ ని పెడ‌దాం అన్నారు. అప్పుడు నేను ఇంట‌ర్వెల్ ఫైట్ ఒక్క‌టీ నాకు వ‌దిలేండి. మిగాతా ఫైట్స్ ఫైట్ మాస్ట‌ర్ తో చేయిద్దాం అన్నాను. స‌రే.. ఓకే అని ఒప్పుకున్నారు. అయితే.. రెండు రోజుల్లో ఫైట్ సీన్ తీయాలి. ఓవ‌రాల్ గా ఎలా తీయాలి ఐడియా ఉంది. అయితే.. ఇక షూటింగ్ కి రెండు రోజుల్లో వెళ‌తాం అన‌గా టెన్ష‌న్ మొద‌లైంది.

బిల్డప్ ఇవ్వాలని తెలుసు.. ఛేజ్ సీన్ తీయాలి అని తెలుసు.. అయితే.. ఏది ఎంత సేపు తీయాల‌నేది టెన్ష‌న్. అప్పుడు శివ సినిమా క్యాసెట్ తెప్పించుకుని సైకిల్ చైన్ ఫైట్ పెట్టి షాట్ బై షాట్ రాసుకున్నాను. సీన్ స్టార్ట్ అయిన త‌ర్వాత ఎన్ని బిల్డ‌ప్ షాట్స్ ప‌డ్డాయ్.. ఎన్ని షాట్స్ రియాక్ష‌న్ క్లోజ్ లు క‌ట్ చేసారు. ఎప్పుడు ఫ‌స్ట్ దెబ్బ ప‌డింది… అన్నీ రాసుకున్నాను. చూస్తే… ఆ ఛేజ్ ఫైట్ అంతా 30%. మిగ‌తా బిల్డ‌ప్ అంతా.. 60%.. ఎండ్ ఓ 10% ఉంటుంది.

స్టూడెంట్ నెం 1 సినిమాకి యాజ‌టీజ్ ఫాలో అయిపోయాను. బ‌ట్ ఐ ఛేంజ్డ్ ఎవ్రీ థింగ్. స్టూడెంట్ నెం లో ఫైట్ సీన్… కాలేజే కానీ.. సైకిల్ ఛైన్ ఉండ‌దు ఏమీ ఉండ‌దు. షాట్స్ లెంగ్త్ చూసుకుంటే.. అన్నీ అలాగే ఉంటాయి. శివ‌లో సైకిల్ ఛైన్ ఫైట్ కి ఎన్ని బిల్డ‌ప్ షాట్స్ ఉన్నాయో స్టూడెంట్ నెం 1 సినిమాలో కాలేజీ ఫైట్ లో అన్ని బిల్డ‌ప్ షాట్స్ ఉంటాయి. అక్క‌డ ఎన్ని క్లోజ‌ప్ లు ఉన్నాయో ఇక్క‌డ అన్ని క్లోజ‌ప్ లు ఉంటాయి. రాము గారి స్టాండడ్ ఏంటంటే… (ఇంకా ఉంది)

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.