ఆ కామ్రేడ్ ను ప్రగతి భవన్‌కు పిలిపించుకున్న కేసీఆర్.. కారణం ఇదేనా?

By సుభాష్  Published on  12 Sep 2020 6:17 AM GMT
ఆ కామ్రేడ్ ను ప్రగతి భవన్‌కు పిలిపించుకున్న కేసీఆర్.. కారణం ఇదేనా?

ఎప్పుడు ఎవరిని ఎంతమేర స్నేహం చేయటం లాంటి చిత్రమైన ఎత్తులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాత్రమే సాధ్యమని చెప్పాలి. పరిస్థితులకు తగ్గట్లుగా మారటం.. పరిణామాలకు తగినట్లుగా వ్యవహరించటం ఆయనకు కొత్తేం కాదు. ఎప్పుడు ఎవరిని తిడతారో.. మరెప్పుడు ఆకాశానికి ఎత్తేస్తారో చెప్పటం అంత తేలికైన విషయం కాదు. కొన్నేళ్ల క్రితం కమ్యూనిస్టుపార్టీకి చెందిన ఆగ్రనేతలు సీఎం కేసీఆర్ కు వినపతిపత్రం ఇచ్చేందుకు సెక్రటేరియట్ కు వెళ్లి.. ఆయన అపాయింట్ మెంట్ కోసం గంటల కొద్దీ సమయం వెయిట్ చేయటం తెలిసిందే. ఆ సందర్భంలో కామ్రేడ్స్ ను కలిసేందుకు టైం లేదన్న కేసీఆర్ మాటలు.. వారందరికి షాకింగ్ గా మారటమే కాదు.. తీవ్రమైన అవమానంగా ఫీలయ్యారు.

ఇలా తనకు నచ్చనప్పుడు నిర్మోహమాటంగా రిజెక్టు చేసే తత్త్వం కేసీఆర్ సొంతంగాచెబుతారు. అందుకే ఆయన ఎప్పుడు దగ్గరకు తీసుకుంటారో..ఎప్పుడు దూరం పెడతారో అంచనా వేయటం చాలా కష్టమని చెబుతారు. ఇదిలా ఉంటే.. తాజాగా తెలంగాణ సీపీఐరాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డిని ప్రగతిభవన్ కు రావాలంటూ ప్రత్యేక ఆహ్వానం అందింది. ముఖ్యమంత్రే స్వయంగా తన ఇంటికి రావాలని ఒక కామ్రేడ్ నేతను కోరటం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెర తీసిందని చెప్పాలి.

ఉన్నట్లుండి కామ్రేడ్స్ మీద కేసీఆర్ కు అంత ప్రేమ పుట్టుకు వచ్చిందన్న విషయంలోకి వెళితే.. త్వరలో జరిగే దుబ్బాక ఉప ఎన్నికలుగా చెబుతున్నారు. ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీని సొంతం చేసుకోవటం ద్వారా.. తెలంగాణలో టీఆర్ఎస్ తప్పించి మరే పార్టీకి అవకాశం లేదన్న విషయాన్ని స్పష్టం చేయాలన్న పట్టుదలతో సారు ఉన్నట్లు చెబుతున్నారు.

తాను అనుకున్నది సాధించటం కోసం పక్కా ప్లాన్ వేసే ఆయన.. ఏ చిన్న అవకాశాన్ని విడిచి పెట్టని గుణం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. తాజాగా అలాంటి వ్యూహంలో భాగంగానే చాడాను ప్రగతిభవన్ కు పిలిపించుకున్నారని చెబుతున్నారు. ఆ మధ్యన హూజూర్ నగర్ ఉప ఎన్నికల్లోనూ సీపీఐ మద్దతు తీసుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నించినప్పటికా సాధ్యం కాలేదు. మరి.. ఈసారైనా వర్కువుట్ అవుతుందో లేదో చూడాలి.

Next Story