హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు ఆస్ట్రేలియా నుంచి ప్రత్యేక ఆహ్వానం వచ్చింది. ఆస్ట్రేలియా, భారత్‌ లీడర్‌ షిప్‌ సదస్సుకు హాజరుకావాలని ఆహ్వానం అందింది. డిసెంబర్‌ 8, 9 తేదీల్లో మెల్‌బోర్న్‌ వేదికగా ఈ సదస్సు జరగనుంది. ఈ సదస్సులో వివిధ రంగాల్లో పెట్టుబడుల అవకశాలపై చర్చించనున్నారు. ఆస్ట్రేలియా, భారత్‌ లీడర్‌ షిప్‌ సదస్సులో ఇరుదేశాలకు చెందిన వ్యాపార ప్రతినిధులు, వ్యాపారులు పాల్గొననున్నారు. పెట్టుబడుల బలోపేతం దిశగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై సదస్సులో చర్చించనున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.