ప్రజల బాధలు అర్థం చేసుకోండి: ఏపీ పోలీసులను కోరిన నల్గొండ ఎస్పీ

By సుభాష్  Published on  8 May 2020 2:46 PM GMT
ప్రజల బాధలు అర్థం చేసుకోండి: ఏపీ పోలీసులను కోరిన నల్గొండ ఎస్పీ

ముఖ్యాంశాలు

► ఏపీ పోలీసులను పోలీసులను కోరిన జిల్లా ఎస్పీ

► వాడపల్లి వద్ద తాజా పరిస్థితి, వందల సంఖ్యలో నిలిచిపోయిన ప్రయాణికుల

► పరిస్థితిని గుంటూరు ఐజీ, ఎస్సీలకు వివరించిన రంగనాథ్‌

► విపత్కర పరిస్థితిలో మానవత్వంతో వ్యవహరించాలని సూచన

► ఎస్పీ రంగనాథ్‌ను అభినందించిన వందలాది ప్రయాణికులు

నల్గొండ: కరోనా కష్టాలతో ఇబ్బందులు పడుతూ లాక్ డౌన్ కష్టాలను ఎదుర్కొంటూ వారంతా ఎక్కడెక్కడి నుండో స్వంత రాష్ట్రానికి వెళ్ళడానికి తాము బయలుదేరిన ప్రాంతం నుండి అనుమతులు తీసుకొని బయలుదేరి వచ్చారు. కానీ ఆంద్రప్రదేశ్ పోలీసులు అనుమతించకపోవడంతో తెలంగాణ సరిహద్దులలో చిక్కుకుపోయారు. స్వంత రాష్ట్రానికి అనుమతి లేక వచ్చిన ప్రాంతానికి తిరిగి వెళ్లే పరిస్థితి లేక తిండి తిప్పలు లేక రోజుల తరబడి అనేక అవస్థలు పడుతున్నారు. వారిని స్వస్థలాలకు పంపేందుకు చొరవ తీసుకొని ఆంధ్రా అధికారులతో మాట్లాడి అనుమతించేలా కృషి చేసి మరోసారి మానవత్వాన్ని ప్రదర్శించారు నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్‌.

నల్లగొండ జిల్లా వాడపల్లి వద్ద తెలంగాణ - ఆంధ్రా సరిహద్దుల వద్ద గత మూడు, నాలుగు రోజులుగా ఆంధ్రా అధికారుల అనుమతి కోసం ఎదురుచూపులు చూస్తూ తిండి తిప్పలు లేక అవస్థలు పడుతున్న ప్రజలు, ప్రయాణీకుల బాధలను తీర్చేందుకు నిరంతరాయంగా కృషి చేస్తున్న నల్గొండ జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాథ్‌ శుక్రవారం ప్రత్యేకంగా చొరవ తీసుకొని పొందుగుల చెక్ పోస్ట్ వద్దకు వెళ్లి ఆంధ్రా అధికారులతో పరిస్థితిని వివరించడంతో పాటు గుంటూరు ఐజీ, ఎస్పీలతో ఫోన్ లో మాట్లాడారు. వాడపల్లి వద్ద పడిగాపులు పడుతున్న ప్రయాణికుల బాధలను వారికి తెలియజేశారు. విపత్కర పరిస్థితులలో మానవత్వంతో వ్యవహరించాలని ఆంధ్రా పోలీస్ అధికారులను కోరారు.

లాక్ డౌన్ కారణంగా ఎలాంటి సౌకర్యాలు లేక, తిండి దొరకక ప్రయాణికులు, వలస కార్మికులు పడుతున్న బాధలను అర్దం చేసుకోవాలని వారికి సూచించారు ఎస్పీ రంగనాథ్‌.

వాడపల్లి సరిహద్దు వద్ద ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను తీర్చడం కోసం నిరంతరాయంగా కృషి చేస్తున్న జిల్లా ఎస్పీ రంగనాథ్‌ధ్ శుక్రవారం ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఆంధ్రా అధికారులతో మాట్లాడి అనుమతించాలని కోరడం, ఆంధ్రా పోలీసులు కొంత సానుకూలంగా స్పందించడం పట్ల వాడపల్లి వద్ద పడిగాపులు పడుతున్న ప్రజలు, ప్రయాణికులు ఎస్పీ రంగనాథ్‌ చొరవ, మానవత్వాన్ని అభినందించి నల్లగొండ పోలీసుల కృషిని ప్రశంసించారు. తమకు అల్పాహారం, భోజనం అందించడంతో పాటు స్వస్థలాలకు చేర్చడానికి చేసిన కృషిని ఎన్నటికీ మర్చిపోలేమని నల్గొండ పోలీసులకు జేజేలు పలికారు.

Next Story