మ‌రో 14 జిల్లాల‌ను గ్రీన్‌జోన్‌లో చేర్చాల‌ని కేంద్రాన్ని కోరాం : ఈట‌ల‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 May 2020 1:43 PM GMT
మ‌రో 14 జిల్లాల‌ను గ్రీన్‌జోన్‌లో చేర్చాల‌ని కేంద్రాన్ని కోరాం : ఈట‌ల‌

తెలంగాణ‌లో కరోనా త‌గ్గుముఖం ప‌డుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. గ‌త వారం రోజులుగా త‌క్కువ‌గా కేసులు న‌మోదు అవుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో 10 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ తెలిపారు. వీటితో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1132కి చేరింద‌న్నారు. ఈ రోజు 34 మంది ఆస్ప‌త్రి డిశ్చార్జి కాగా.. 376 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నార‌న్నారు.

కేంద్రం నిబంధనల ప్రకారం మరో 14 జిల్లాల్లో కరోనా లేదు. 14 జిల్లాలను గ్రీన్‌జోన్‌లో చేర్చాలని కేంద్రాన్ని కోరామ‌న్నారు. ప్రస్తుతం 9 జిల్లాలు గ్రీన్‌జోన్‌లో ఉన్నాయని, సూర్యాపేట, వరంగల్‌ అర్బన్‌, నిజామాబాద్ జిల్లాలను ఆరెంజ్‌ జోన్‌లో చేర్చాలని కేంద్రాన్నికోరిన‌ట్లు చెప్పారు. కేంద్రం ఈనెల 17 వరకు అని చెప్పినా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ 29 వరకు పొడిగించారు. కరోనా రాకుండా ప్రజలు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సోమవారం కేంద్రం నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉందని మంత్రి తెలిపారు.

Next Story