విషమంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం: ఎంజీఎం ఆస్పత్రి

By సుభాష్  Published on  19 Aug 2020 12:52 PM GMT
విషమంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం: ఎంజీఎం ఆస్పత్రి

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా వైరస్‌ సోకిన విషయం తెలిసిందే. దీంతో ఆయన చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఆరోగ్యం విషమంగానే ఉందని, ఐసీయూలో వెంటిలేటర్‌పై ఎక్మో సపోర్ట్‌ తో చికిత్స కొనసాగుతుందని చెన్నై ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఎంజీఎం ఆస్పత్రి బాలు ఆరోగ్యంపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

కరోనాతో పోరాడుతన్న బాలు ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలిపారు. అయితే నిన్న వెంటిలేటర్‌ను తొలగించారని వచ్చిన వార్తలపై బాలు కుమారుడు ఎస్పీ చరణ్‌ క్లారిటీ ఇచ్చారు. అలాంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన ఓ వీడియో సందేశం ద్వారా స్పష్టం చేశారు. గతంలో అపోలో ఆసుపత్రిలో చివరి దశలో జయలలితకు ఇదే విధంగా ఎక్మో సిస్టమ్ ద్వారా కృత్రిమ శ్వాస అందించిన వైద్యులు.. తాజాగా బాలు పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇక బాలసుబ్రహ్మణ్యం క్షేమంగా బయటపడాలని ప్రముఖ నటులు చిరంజీవి, రజనీకాంత్‌, కమల్ హాసన్ తో పాటు పలు రాజకీయ నాయకులు, సినిమా రంగానికి చెందిన ప్రముఖులు కోరుకుంటున్నారు.

Mgm

Next Story