భారత్‌లో పుట్టిన వారందరూ హిందువులే: కేరళ గవర్నర్‌

Those who are born, eat and drink in India should be called ‘Hindu’.. Kerala Governor Arif Mohammad. 'హిందూ' అనే పదం భౌగోళిక పదమని, భారతదేశంలో పుట్టి, ఇక్కడి ఆహారాన్ని, నీటిని తాగిన వారిని 'హిందూ'

By అంజి  Published on  29 Jan 2023 8:05 AM GMT
భారత్‌లో పుట్టిన వారందరూ హిందువులే: కేరళ గవర్నర్‌

'హిందూ' అనే పదం భౌగోళిక పదమని, భారతదేశంలో పుట్టి, ఇక్కడి ఆహారాన్ని, నీటిని తాగిన వారిని 'హిందూ' అని పిలవాలని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ అన్నారు. ఉత్తర అమెరికాలో స్థిరపడిన మలయాళీ హిందువులు శనివారం తిరువనంతపురంలో నిర్వహించిన 'హిందూ సమ్మేళనం'ను ప్రారంభిస్తూ కేరళ గవర్నర్ ఈ వ్యాఖ్య చేశారు. ''హిందూ అనేది మతపరమైన పదమని నేను భావించడం లేదని, అది భౌగోళిక పదమని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఒకసారి చెప్పారు. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ భారతదేశంలో పండిన ఆహారాన్ని తింటారు లేదా భారతీయ నదుల నీటిని తాగితే వారు హిందువులుగా పిలవబడతారు'' అని గవర్నర్‌ ఆరిఫ్ అన్నారు.

''మీరు నన్ను హిందువు అని పిలవాలి... వలసరాజ్యాల కాలంలో హిందూ, ముస్లిం, సిక్కు వంటి పదాలను ఉపయోగించారు. ఎందుకంటే పౌరుల సాధారణ హక్కులను కూడా నిర్ణయించడానికి బ్రిటీషర్లు కమ్యూనిటీలను ప్రాతిపదికగా చేసుకున్నారు'' అని చెప్పారు. స్వాతంత్ర్యానికి పూర్వం సనాతన ధర్మాన్ని విశ్వసించిన రాజులు, పాలకులు అన్ని మతాలను ఆమోదించారని చెప్పారు. ‘‘నేను హిందువును’’ అని చెప్పుకోవడం తప్పు అనే భావన కలిగించే కుట్ర కేరళలో జరుగుతోందన్నారు.

కేరళ గవర్నర్ ఇంతకుముందు బీబీసీ డాక్యుమెంటరీని నిందించారు. భారతదేశాన్ని వంద ముక్కలుగా చూడాలనుకునే ఇలాంటి ప్రతికూల ప్రచారానికి పాల్పడుతున్నారని అన్నారు. ఇలాంటి డాక్యుమెంటరీలు తీస్తూ రకరకాల ప్రచారంలో మునిగితేలుతున్నారని, బ్రిటీష్ వారు భారతదేశానికి వచ్చిన నాటి డాక్యుమెంటరీని ఎందుకు తీయరు అని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ అన్నారు. భారత్ పేద దేశం కాదన్నారు. ''అందుకే భారతదేశానికి అద్భుతమైన సంపద కారణంగా బయటి నుండి ప్రజలు వచ్చారు. కానీ 1947 నాటికి మనం దాదాపు దక్షిణాసియాలో పేదరికానికి చిహ్నంగా మారాము. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది'' అని అన్నారు.

''నేడు మల్టీ నేషనల్‌ కంపెనీలకు భారతీయ మూలాలున్న వ్యక్తులు నాయకత్వం వహిస్తున్నారు. ప్రపంచం భారతదేశ సామర్థ్యాన్ని గుర్తిస్తోంది. మనం శక్తివంతులైతే మనల్ని ఎవరూ బెదిరించలేరన్న విషయం మన చరిత్రను బట్టి ప్రపంచానికి తెలుసు. మేము ఈ శక్తులను ఇతరులపై ఆధిపత్యం చెలాయించడానికి ఎన్నడూ ఉపయోగించలేదు. కానీ మేము స్త్రీ, పురుషుల సంభావ్య దైవత్వాన్ని నమ్ముతాము'' అని అన్నారు.

Next Story